ప్రస్తుతం గ్రాసరీ షాపుల నుండి చెప్పుల షాపు వరకు ‘క్యారీబ్యాగ్ కావాలా?’ అనేది సిబ్బంది తొలి ప్రశ్నగా మారిపోయింది. దానికి ‘ఓకే’ అనకపోతే కొన్నిసార్లు విచిత్రం గా చూస్తున్నారు. మనం షాపింగ్ చేసినప్పుడు, వస్తువులను తీసుకెళ్ళటానికి ఇక క్యారీబ్యాగ్ లను ఉచితంగానే యివ్వాలి. ఒకవేళ ఆ క్యారీబ్యాగ్ పై ఆ కంపనీ పేరో? బ్రాండ్ పేరో? ముద్రిస్తే  ఖచ్చితంగా ఉచితంగా ఇవాలి.  ఇక ఆ  క్యారీబ్యాగ్  పర్యావరణ అన్నుకూలతను కలిగి ఉండాలి. ఇది వినిమయదారుల ఫోరం ఆదేశం మాత్రమే కాదు తీర్పు కూడా.


చండీగడ్ కు చెందిన ఒక కస్టమర్ చెప్పులు కొనేందుకు స్థానికంగా ఉన్న మల్టీ నేషనల్ చెప్పుల కంపెనీకి వెళ్లాడు. అక్కడ తనకు నచ్చిన ఒక జత చెప్పులు కొంటే, మొత్తం ₹402/-  బిల్లు అయ్యింది. అయితే చెప్పుల జత ధర కన్నా ₹ 3/- ఎక్కువగా బిల్లులో వసూలు చేశారు. ఇది గమనించిన కస్టమర్ మూడు రూపాయలు ఎందుకు అదనంగా వేశారు? అని షాపు సిబ్బందిని నిలదీయగా, చెప్పులతో పాటు ఇచ్చిన కాగితపు సంచీ కి కూడా బిల్ వేశామని సిబ్బంది బదులిచ్చింది.

Image result for consumer forum case for free carry bag

ఇంకేముంది ఆ సమాధానంతో కస్టమర్ కు చిర్రెత్తుకొచ్చింది. ₹399/- పెట్టి చెప్పులు కొంటే కనీసం ఒక సంచి కూడా ఇవ్వరా? కోపమొచ్చి, ఆ కంపెనీ పని పట్టాలను కున్నాడు. అనుకున్నదే తడవుగా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.


దినేష్ తన వాదనలో ప్రధానంగా, చెప్పుల కంపెనీ వారు తన వద్ద మూడు రూపాయలు అదనంగా వసూలు చేసి ఇచ్చిన సంచీపై తమ బ్రాండ్ పేరును పెద్దగా వేసుకున్నారని ఫోరంకు తెలిపాడు. అయితే తనకు ఇష్టం లేకపోయినా తన సంచిపై కంపెనీ బ్రాండ్ ఉన్నందుకు నష్టపరిహారం చెల్లించాలని ఫోరంను వేడుకున్నాడు.

Image result for consumer forum

ఇంకేముంది ఆ మల్టీ నేషనల్ పాదరక్షల బ్రాండ్ కంపెనీ చేసిన పనికి వినియోగదారుల ఫోరం మొట్టికాయ కాస్త ఘట్టిగానే వేసింది. వినియోగదారుడికి లిటిగేషన్ రీఫండ్ కింద ₹1000/- వినియోగదారుడికి మానసికంగా ఆందోళన కలిగించి నందుకు ₹3000/- దానికి అదనంగా మరో ₹5000/- నష్టపరిహారం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆ కంపెనీ తమ వద్ద ఉత్పత్తులు కొనుగోలు చేసిన వినియోగదారులకు ఉచితంగానే క్యారీబ్యాగ్స్ ఇవ్వాలని, అలాగే వీలైనంత వరకూ పర్యావరణానికి అనుకూలం గా ఉండే సంచీలనే ఇవ్వాలని సూచించింది.

Bata Fined Rs 9000 For Asking Customer To Pay Rs 3 For Carry Bag - Sakshi

మరింత సమాచారం తెలుసుకోండి: