రాష్ట్ర ఎన్నికలు పూర్తిగా జగన్ కు అనుకూలంగా ఉన్నాయని ఇప్పటికే పలు సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. దీనితో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఇక లాంఛనమే అని అర్ధం అవుతుంది. ఆల్రెడీ ఓటర్లు చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు, అవినీతి, స్వయంగా బాబు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న కసితో కసిగా ఓటేశారన్న విషయం పచ్చ బ్యాచ్‌కి అర్థమైపోయింది. జాతీయ స్థాయి సర్వే సంస్థలన్నీ కూడా జగన్‌కే పట్టం కట్టాయి.


రేపు రిజల్ట్స్ జగన్‌కి పూర్తిగా పాజిటివ్‌గా ఉంటాయన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్‌తో జగన్ విజయాన్ని తగ్గించి చూపించే ప్రయత్నం చేయాలని ఇప్పటి నుంచీ ఎన్నికలు బాగా జరగలేదు. ఈవీఎంలు పని చేయలేదు అని గత్తర గత్తర చేస్తూ ఇంకా దిగజారుతున్నాడు బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లు ఎవరూ ఎన్నికలు జరిగిన విధానంపై కంప్లైంట్స్ చెయ్యలేదు. కానీ బాబు అండ్ పచ్చ మీడియా మాత్రం జగన్ విజయం ఈవిఎంల మేనిప్యులేషన్ అని ప్రజలను నమ్మించడం కోసం రకరకాల ప్రయత్నాలు ఇప్పటి నుంచే చేస్తూ ఉన్నారు.


అయితే చంద్రబాబుకు తాజా షాక్ పశ్ఛిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి వచ్చింది. వైఎస్ జగన్‌కి ఫోన్ చేసిన మమతా బెనర్జీ కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. దేశంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రికి, ప్రధానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అందుతూ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే మమతా కూడా జగన్ సాధించబోయే విజయం గురించి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందట. అందుకే భవిష్యత్‌లో ప్ర‌ధాని పదవికి పోటీలో పడాలనుకుంటున్న మమతా బెనర్జీ ఎందుకైనా మంచిదన్న కోణంలో జగన్‌తో సుహృద్భావ వాతావరణం కోసం కాల్ చేసి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి: