ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఉత్త‌రాంధ్ర‌లో శ్రీకాకుళం జిల్లాలో ఎవ‌రు ఎన్ని సీట్లు గెలుస్తారు ? అన్న దానిపై రెండు పార్టీల్లోనూ పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఎన్నిక‌ల ప్రారంభానికి ముందు జిల్లాలో జ‌న‌సేన గ‌ట్టి ప్ర‌భావం చూపుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఇంకా చెప్పాలంటే జిల్లాలోని ఇచ్ఛాపురం, ప‌లాస నియోజ‌క‌వ‌ర్గాల‌ను జ‌న‌సేన గెలుచుకుంటుంద‌న్న అంచ‌నాలు కూడా ఉన్నాయి. చివ‌ర‌కు ఎన్నిక‌ల సంగ్రామం ప్రారంభ‌మైన వెంట‌నే జ‌న‌సేన పూర్తిగా చేతులు ఎత్తేసింది. చివ‌ర‌కు సిక్కోలులో ఎన్నిక‌ల సంగ్రామం వైసీసీ వ‌ర్సెస్ జ‌న‌సేన మ‌ధ్యే జ‌రిగింది. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌రు టీడీపీకి 7, వైసీపీకి మూడు సీట్లు ఇచ్చారు. ఆ త‌ర్వాత పాత‌ప‌ట్నం ఎమ్మెల్యే క‌ల‌మ‌ట వెంక‌ట‌ర‌మ‌ణ టీడీపీలోకి జంప్ చేసేశ‌వారు.


ఇక ఐదేళ్ల‌లో శ్రీకాకుళం జిల్లా ప్ర‌జ‌లు టీడీపీ ప్ర‌భుత్వంపై పెట్టుకున్న ఆశ‌ల‌ను వ‌మ్ము చేసిన‌ట్టే పోలింగ్ స‌ర‌ళి చెప్పేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో.. ఈ దఫా వైసీపీ దూకుడు ప్రదర్శిస్తుందని అంటున్నారు. ఈ పార్టీ అంచనాల ప్రకారం.. ఆరు చోట్ల వైసీపీ విజయం సాధించే అవకాశం ఉందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇక, టీడీపీ మొత్తంగా కేవలం 4 స్థానాల్లో మాత్రమే విజయం  సాధిస్తుందని ఈ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక టీడీపీ ఎంపీగా పోటీ చేస్తోన్న రామ్మోహ‌న్‌నాయుడు సైతం గెలిచే స్థితి లేద‌ని... వైసీపీ నుంచి పోటీ చేస్తోన్న దువ్వాడ శ్రీనివాస్ రామ్మోహ‌న్‌నాయుడుకు గ‌ట్టి పోటీ ఇచ్చార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. మంత్రి అచ్చెన్న కూడా టెక్క‌లిలో సైతం ఏటికి ఎదురీదుతున్నారు. అయితే ఆయ‌న‌కు స్వ‌ల్ప ఎడ్జ్ ఉంద‌ట‌.


వైసీపీ వర్గాలు వేస్తున్న అంచనాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, ఎచ్చెర్ల, ఆముదాలవలస, రాజాం నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు సాధిస్తుంది. మిగిలిన ఆరు నియోజకవర్గాలు శ్రీకాకుళం, పాలకొండ, పలాస, ఇచ్చాపురం, పాతపట్నం, నరసన్నపేట నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైసీపీ దూకుడు ప్రదర్శిస్తుందని అంటున్నారు. అయితే, ఆయా నియోజకవర్గాల్లో ఒకింత గట్టి పోటీ ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వైసీపీ ఆరు చోట్ల, టీడీపీ 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని వైసీపీ అంచనా. ఇక, ఇక్కడ గత ఎన్నికల విషయానికి వస్తే.. మూడు స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. మిగిలిన 7 స్థానాల్లోనూ సైకిల్‌ దూసుకు పోయింది. ఇది ఇప్పుడు రివర్స్‌ అవుతుందని వైసీపీ అంచనా వేస్తోంది. అయితే, స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులు దీనికి అనుకూలంగా ఉంటాయా? ఉండవా? అనేది తెలియాలంటే.. మరో 39 రోజులు వెయిట్‌ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: