ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే మామూలు విషయం కాదు. ఆ విషయం తెలుసు కాబట్టే సిఎంగా ఉన్న మామగారు ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని, సిఎం కుర్చీని చంద్రబాబునాయుడు లాక్కున్నారు. అలాంటిది మే 23వ తేదీన ఫలితాలు ఎలాగుంటాయో ఇపుడెవరూ చెప్పలేరు. కాకపోతే  జగన్మోహన్ రెడ్డే అధికారంలోకి వచ్చేదంటూ ప్రచారం జరుగుతోంది. కాబోయే సిఎం జగనే అనే విషయంలో ఇంత ఊపు రావటానికి కారణం ఎవరు ? ఎవరంటే ఇంకెవరు పికె అలియాస్ ప్రశాంత్ కిషోర్ అని చెప్పవచ్చు.

 

రాజకీయ వ్యూహకర్తగా బాగా పాపులరైన పికెను జగన్ తన వ్యూహకర్తగా దాదాపు రెండేళ్ళ క్రితం నియమించుకున్నారు.  అప్పటి నుండి అండర్ గ్రౌండ్ లో పికె బృందం తన పని మొదలుపెట్టింది. ముందుగా రాష్ట్రంలోని గ్రామస్ధాయి నుండి ఓటర్ల వివరాలు, సామాజికవర్గాల వివరాలను సేకరించారు.  తన బృందంతో గ్రామాస్ధాయిలో విస్తృతంగా పర్యటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని జనాల ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసుకున్నారు. వాళ్ళ అవసరాలేంటి ? పరిష్కారాలేంటి అన్న విషయాలను వాళ్ళ నుండి తెలుసుకున్నారు.

 

జనాలకు చేరువకావాలంటే జగన్ ఏం చేయాలనే విషయంలో దృష్టి పెట్టారు.  అందులో నుండి పుట్టిందే పాదయాత్ర.  తర్వాత మధ్య తరగతి జనాలపై  దృష్టిని కేంద్రీకరించారు. సామాజికవర్గాలను బాగా అధ్యయనం చేశారు. ఆయా ప్రాంతాల్లో గట్టి నేతలెవరున్నారు ? ఏ నేతకు టికెట్ ఇస్తే బాగుంటుందనే అంశాలపై జనాలభిప్రాయాన్ని సేకరించారు. రాజకీయాలకు దూరంగా ఉండే ముఖ్యమైన వ్యక్తుల వివరాలు సేకరించారు.

 

ఏ నియోజకవర్గంలో ఏ సామాజికవర్గం బలంగా ఉందనే విషయాన్ని గమనించారు. ప్రయారిటీ ప్రకారం సామాజికవర్గాల వారీగా గట్టి నేతలను గుర్తించారు.  పనిలో పనిగా అంగ, అర్ధ బలాల వివరాలను కూడా దగ్గర పెట్టుకున్నారు.  ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యలేవి ? చంద్రబాబునాయుడుపై జనాలభిప్రాయాలేంటి ? అనే విషయాల్లో ఒకటికి పదిసార్లు సర్వేలు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాలపై ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత జగన్ తో చర్చించారు.

 

చివరాఖరుగా పాదయాత్రను డిజైన్ చేశారు. పాదయాత్రలో టచ్ చేయాల్సిన అంశాలను వివరిచారు. దాంతో పాదయాత్ర మొదలుపెట్టి ముగించే సమయానికే జగన్ కు నియోజకవర్గాల వివరాలపై పూర్తిగా అవగాహన వచ్చేసింది. దాంతో పాటు ఏ నియోజకవర్గంలో అభ్యర్ధిగా ఎవరిని నిలబెడితే విజయావకాశాలు ఉంటాయో కూడా జగన్ లో క్లారిటీ వచ్చింది.

 

అదే సమయంలో సోషల్ మీడియాను బాగా యాక్టివ్ చేయటం కూడా ఇందులో భాగమే. పికె నివేదిక ఆధారంగానే చాలా నియోజకవర్గాల్లో జనగ్ అభ్యర్ధులను ఫైనల్ చేశారు.  వాళ్ళకి సోషల్ మీడియా ద్వారా జనాల మద్దతు కూడగట్టేందుకు విపరీతంగా కృషి చేశారు. సరే ఆ తర్వాత జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.  అంటే తెరముందు జగన్ ఎంత కష్టపడ్డారో తెరవెనుక పికె కూడా అంతే కష్టపడ్డారు. పికె పడిన కష్టం వల్లే జగనే కాబోయే సిఎం అనే ఊపొచ్చింది.  ఈ విషయంలో ఎవరైనా అనుమానాలున్నాయా ?


మరింత సమాచారం తెలుసుకోండి: