బీహార్ .. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అరాచకం.. మనల్ని మన నాయకులు అలా ట్యూన్ చేశారు మరి. బీహార్లో అలాంటి పరిస్థితులు ఇప్పుడు చాలా వరకూ తగ్గిపోయినా మనం మాత్రం ఇంకా బీహార్ ను అరాచక ప్రాంతంగానే ముద్ర వేస్తుంటాం.


ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తరచూ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని బీహార్ గా మారుస్తారు..బీహార్ వ్యక్తి ప్రశాంత్‌ కిషోర్‌ ఏపీ ప్రశాంతతను చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తుంటారు. దీనిపై ఓసారి ప్రశాంత్ కిశోర్ కూడా ఘాటుగానే స్పందించారు. 

ఇప్పుడు మన తెలుగు వారికి షాక్ ఇచ్చే అంశం ఏంటంటే.. ఇటీవల ఇండియా టుడే సంస్థ నిర్వహించిన ఓ గణాంక సర్వేలో బీహార్ ఎంపీలే అందరికంటే బెస్ట్ అని తేలిందట. ఎంపీలకు వారి పని తీరును బట్టి ర్యాంకులు ఇచ్చింది ఇండియా టుడే.. ఇందులో తొలి స్థానాల్లో బీహార్ ఎంపీలు ఉన్నారు. 

మరి.. పార్లమెంటును గడగడలాడించిన మన ఆంధ్రా ఎంపీల పరిస్థితి ఏంటంటారా.. కనీసం తొలి వంద స్థానాల్లో ఒక్కరు కూడా లేని దుస్థితి మనదు. ఎంతసేపూ పార్లమెంట్ ప్రాంగణంలో ప్ల కార్డులు పట్టుకుని నిలబడటం తప్ప.. మనవాళ్లు నిర్మాణాత్మకంగా చేసిందేమీ లేదన్నమాట. 

మరో షాకింగ్ విషయం ఏంటంటే.. పార్లమెంట్ సింహంగా.. తన ప్రసంగంతో ప్రధాని మోడీకి నిద్రపట్టనీయకుండాచేశారని మన మీడియా గొప్పలు చెప్పిన గల్లా జయదేవ్ ర్యాంకు ఎంతో తెలుసా.. 214.. అదన్నమాట సంగతి. మనవాళ్లు ప్రశ్నలు అడగటం.. చర్చించడం.. నిలదీయడం వంటి పనులు మాని నిరసనలకు పరిమితమైన దాని ఫలితమే ఈ ర్యాంకులుగా భావించొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: