ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అత్యంత సహజం. గతంలో అయితే హుందాగా ప్రచారం చేసుకునే వారు. ఓడే వారు గెలిచే వారిని అభినందిస్తే మీరు సభలో ఉండాలని గెలిచిన వారు కూడా కోరుకునేవారు. అది అచ్చమైన ప్రజాస్వామ్యం. ఇపుడు చూస్తే ఓ నాయకున్ని పార్టీని కూడా లేకుండా చేసే తుచ్చమైన  రాజకీయం సాగుతోంది. 


అది వార్డు  నుంచి పీఎం పోస్ట్ వరకూ ఇదే పద్ధతిలో సాగుతోంది. అయితే  ఇక్కడ నాయకుడు, పార్టీలు తలచుకుంటే జరిగేది కాదు. ప్రజలు నిర్ణేతలు. వారు అయిదేళ్ళకు ఓ మారు జాతకాలు తిరగరాస్తారు. అయితే వారిని కనిపెట్టుకుని పార్టీలు, నాయకులు ఉండాలి. పోరాటాలు చేయాలి. మన్నన పొందగలగాలి. విషయానికి వస్తే ఏపీలో ఇపుడున్న పరిస్థితులు చూస్తూంటే మే 23 తరువాత ఒకరే విజేత అవుతారు. మరి ఓడిన వారి పరిస్థితి ఏంటి.


అన్ని స‌ర్వేలు జగన్ సీఎం అంటున్నాయి. వైసీపీ గెలవవచ్చు అని కూడా ధీమాగా చెబుతున్నారు. కానీ ఒకవేళ తేడా  కొట్టి జగన్ పార్టీ ఓడిపోతే ఏం జరుగుతుంది. అంటే జగన్ వరకూ తీసుకుంటే ఆయన కంటే గొప్ప పోరాటయోధుడు ఎవరూ లేరు. ఆయన బలవంతుడు. మళ్ళీ పార్టీని జనంలోకి తీసుకుపోగల నేర్పు, ఓర్పు, అందుకు తగిన రాజకీయ పరిణతి, వయసు కూడా జగన్ కి పుష్కలంగా ఉన్నాయి.
అదే టీడీపీ ఓడిపోతే పరిస్థితి ఏంటి. ఈ మాట వింటేనే టీడీపీ ఉలిక్కిపడుతోంది. టీడీపీకి కర్త కర్మ క్రియ చంద్రబాబు. ఆయన వయసు ఇపుడు  డెబ్బయి ఏళ్ళు. ఇప్పటి నుంచి అయిదేళ్ళ పాటు పోరాటాలు చేయాలంటే అందుకు ఆయన రెడీ కానీ వయసు సహకరించాలి. ఇక వారసుడిగా తెచ్చిన లోకేష్ మీద సొంత పార్టీలోనే నమ్మకం లేదు. బాబుని వ్యతిరేకించే వారు సైతం ఆయన రాజకీయ చతురతను మెచ్చుకుంటారు.
ఇక లోకేష్ ని అభిమానించే వారు సైతం ఆయన నాయకత్వ లక్షణాల పట్ల డౌట్ పడతారు. అటువంటిది ఓ వైపు జగన్ అధికారంలో ఉంటే లోకేష్ పార్టీని నడిపించగలరా. చంద్రబాబు వయసు రిత్యా కొంత తగ్గితే పార్టీకి దిక్కెవరు. ఇదే ఇపుడు టీడీపీని ఓటమి కంటే ఎక్కువగా వణికిస్తున్న ప్రశ్నగా ఉందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: