సినిమా హీరో శివాజీ అధికారికంగా పసుపు కండువా కప్పుకోపోయినా గత రెండు సంవత్సరాలుగా టీడీపీకి చెక్క భజన చేసుకుంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గత రెండు సంవత్సరాలుగా డిఫెన్స్‌లో పడుతున్న ప్రతి సారి శివాజీ తెర మీదకు రావడం ఆపరేషన్‌ గురుడానో లేదా మరో ఆపరేషన్‌ అనో పేరు పెట్టుకుని తాను రాసుకొచ్చిన (టీడీపీ వాళ్లు చెప్పిన) అంశాలను వివరిస్తూ ఓ చక్కటి కథ అల్లుతూ తెలుగుదేశాన్ని కాపాడే ప్రయత్నయే చేస్తున్నారు. గత రెండేళ్లుగా శివాజీ ఇదే పనిలో బాగా బిజీ బిజీగా ఉన్నారు. సినిమా లేకపోవడంతో శివాజీకి ఈ కొత్త పని బాగా దొరికినట్లు అయ్యిందన్న చర్చలు నడిచాయి. తాజాగా ఎన్నికలు ముగిసిన వెంటనే సర్వేలన్నీ వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇంతలో సడన్‌గా ప్రత్యక్షం అయిన శివాజీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తన తీర్పును ప్రజంట్‌ చేశాడు. 


90 లక్షల మంది డ్వాక్రా మహిళలు అర్థరాత్రి వరకు క్యూలో ఉండి ఓటు వేశారంటే దానికి నిదర్శనంగా ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పాడు. అంతటితో ఆగకుండా ఈ తర‌హా ఓటింగ్‌ జరిగితే జగన్‌ ఎలా గెలుస్తాడని కూడా ఎదురు ప్రశ్న వేశాడు. శివాజి కథ చక్కగానే అల్లుకున్నట్టు కనపడుతోంది. ఇదిలా ఉంటే 2004, 2009లో ఇదే మహిళలు ఇదే తర‌హాలో ఓట్లు వేశారు. డ్వాక్రా గ్రూపులు పెట్టిన తర్వాతే 2004లో ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు చిత్తు చిత్తుగా ఓడారు.  2004 ఎన్నికల్లో మహిళలు, డ్వాక్రా సంఘాలు చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడించాయి. శివాజీ కాకి లెక్కల సంగతి ఎలా ఉన్నా వాస్త‌వంగా గ్రౌండ్‌ రియాల్టీని మరచిపోయినట్టు కనిపిస్తోంది. ఏపీలో గత ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించడానికి, జగన్‌ ఓడిపోవడానికి ప్రధాన కారణం అనంతపురం, ఉభయగోదావరి జిల్లాలు. 


అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ 12 సీట్లు గెలుచుకుంది. తూర్పు గోదావరిలో 14, ఉభయగోదావరిలో బీజేపీతో కలుపుకుని 15 సీట్లు గెలుచుకుంది. అంటే గత ఎన్నికల్లో జగన్‌కు చంద్రబాబుకు మధ్య సీట్ల తేడా 35. అంటే ఈ మూడు జిల్లాల్లో టీడీపీకి ఏకపక్షంగా సీట్లు రావడంతోనే జగన్‌ ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో సీన్‌ పూర్తిగా రివర్స్‌ అయ్యింది. ఇప్పుడు ఈ మూడు జిల్లాల్లోనూ టీడీపీ సీట్లలో భారీగా గండి పడింది. తక్కువలో తక్కువగా ఈ మూడు జిల్లాల్లో కనీసం 15 సీట్లను టీడీపీ కోల్పోనుంది. గత ఎన్నికల్లో వైసీపీకి నెల్లూరు, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా సీట్లు వచ్చాయి. ఈ నాలుగు జిల్లాల్లో కలిసి టోటల్‌గా 35 సీట్లు వచ్చాయి. వైసీపీ ఈజిల్లాల్లో ఈ సీట్లను మళ్లీ నిలుపుకుని ఉభయగోదావరి, అనంతపురం జిల్లాల్లో మరో 15 సీట్లు సాధిస్తే గెలిచేసినట్టే. లేనిపక్షంలో ఆ 36 సీట్లను తెలుగుదేశం అలాగే ఉంచుకుని గత ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ సీట్లు సాధించిన జిల్లాల్లో మరో 15 సీట్లకు గండి కొడితే సహజంగా తెలుగుదేశం గెలుపుకు దగ్గరవుతుంది. మరి ఈ లెక్కలన్నీ తెలియని శివాజీ తనకు తానేదో కాకి లెక్కలు వేసుకుని టీడీపీకి వంత పడడం అంత సబబుగా లేదేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: