ఎక్కడైనా గెలుస్తారు అనుకునే  అభ్యర్ధులపై పందేలు కాస్తారు. కానీ ఈసారి మాత్రం ఓడిపోయే అభ్యర్ధులు ఎవరు అనే విషయాలపై పందేలు కాస్తున్నారు.  ఆ పందేలు కూడా హాట్ సీట్లుగా ప్రచారంలో ఉన్న కొన్ని నియోజకవర్గాలపైనే పందేల జోరు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, విశాఖపట్న, అనంతపురం జిల్లాల్లో పందేల జోరుగా బాగా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

 

ఓడిపోయే అభ్యర్ధులు అనుకున్న వారిలో అత్యధికంగా మంత్రి గంటా శ్రీనివాసరావుపై పందేలు కాస్తున్నారు. గెలుస్తారో లేదో తెలీదు కానీ పందెం రాయళ్ళ దెబ్బకు గంటాకు బిపి పెరగటం ఖాయం. గంటా తరువాత మంగళగిరిలో నారా లోకేష్, ఆళ్ళగడ్డలో భూమా అఖిలప్రియ,  మైలవరంలో దేవినేని ఉమా మహేశ్వరరావు, నెల్లూరు సిటీలో నారాయణ, సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గుడివాడలో దేవినేని అవినాష్, రాప్తాడులో పరిటాల శ్రీరామ్ అండ్ కో పై బాగా పెందేలు కాస్తున్నారు.

 

తాజాగా మొదలైన రివర్సు పందేలతో అభ్యర్ధులతో పాటు  టిడిపి నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఏదో సినిమాలో చెప్పినట్లు ‘వీడెవండి బాబు ఎవడైనా గెలుస్తాడేని పందేలు కాస్తాడు కానీ ఓడిపోతారని పందేలు కాయటమేంటండి బా..............బూ’ అంటూ టెన్షన్ పడిపోతున్నారు.

 

గంటా పై అత్యధికంగా రూ 15 లక్షలు పందెం కాసారట. లోకేష్ పై రూ 3 లక్షలు,  నగిరిలో రోజాపై లక్షన్నర రూపాయలు, సోమిరెడ్డిపై రూ 5 లక్షలు పందేలు వాటిపై పై పందేలు కూడా జోరుగా పెరిగిపోతోందట. అసలే పోలింగ్ జరిగిన దగ్గర నుండి అభ్యర్ధుల్లో టెన్షన్ ఓ రేంజిలో పెరిగిపోతోంది. దానికితోడు  ఈ పందెం రాయళ్ళ గోలొకటి. ఏం చేద్దాం పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ కు ఇన్ని రోజులు గ్యాపుంటే వ్యవహారం ఇలాగే ఉంటుంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: