బీజేపీ ఫైర్‌బ్రాంఢ్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొద్దికాలంగా పార్టీ కార్య‌క‌లాపాల‌తో అంటీముట్ట‌న‌ట్లుగా ఉంటున్న రాజాసింగ్ తాజాగా క‌ల‌క‌లం చేసే కామెంట్లు చేశారు. తాను టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. అయితే, కేసీఆర్ త‌న ష‌ర‌తుల‌కు కేసీఆర్ ఒప్పుకోవాల‌ని అన్నారు. ఇలా ష‌ర‌తులు పెడుతూ రాజాసింగ్ త‌న చేరిక‌ను మెలిక పెట్టారు.
తాము చేస్తున్న ఉద్యమంలో కేసీఆర్ కలిసివస్తే తాను టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమని రాజాసింగ్‌ అన్నారు.

హైదరాబాద్‌లో శ్రీరామ శోభాయాత్ర అనంతరం జరిగిన బహిరంగ సభలో రాజాసింగ్‌ మాట్లాడుతూ రాజాసింగ్ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం, గోవులను రక్షించేందుకు, మత మార్పిడిలకు వ్యతిరేకంగా ముందుకు వ‌స్తే కేసీఆర్ పార్టీ కండువా క‌ప్పుకొనేందుకు సిద్ధ‌మ‌న్నారు. అయోధ్యలో భవ్య మందిర నిర్మాణం, అఖండ హిందూ రాష్ట్ర స్థాపనకు ప్రతి హిందువు కంకణబుద్ధుడు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రామ మందిరం పూర్తైన తరువాత కాశీ, మథురలోని మందిరాలను నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. నేడు దేశంలో జై శ్రీరామ్ అనడం కూడా మతపరమైనదిగా మారిందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత మాతకీ జై.. వందేమాతరం అనడానికి సిగ్గుపడే వారికి దేశంలో ఉండే అర్హత లేదని అన్నారు. 10-20 నిమిషాల పాటు తమకు సమయమిస్తే దేశంలో ఉన్న దేశ ద్రోహులను తరిమికొడతామని రాజాసింగ్ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: