ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎంచక్కా  ఈవీఎంలలో నిక్షిప్తం అయి ఉన్నాయి. కానీ రాజకీయ జీవుల  ఆరాటం, పోరాటం ఏ మాత్రం తగ్గడంలేదు. కొంతసెపు వూహల్లో వూరేగుతున్నారు. మరి కొంతసేపు నిరాశలో మునిగిపోతున్నారు. గెలుపు పై నమ్మకం పెట్టుకుంటూనే  అంతలోనే అమ్మో అని గుండె పట్టేసుకుంటున్నారు.


ఇదంతా పసుపు పార్టీలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికి మూడు నెలలుగా వచ్చిన ఏ ఒక్క సర్వే కూడా టీడీపీ గెలుస్తుందని చెప్పలేదు. నూటికి నూరుపాళ్ళు వైసీపీదే విజయం అని తేల్చేశాయి. ఇక జనసేన విషయంలో చీల్చే పార్టీగానే డిసైడ్ చేసేశాయి. ఆ పార్టీ నాయకులు కూడా ఈసారికి ఇంతేనని సర్దుకుపోతున్నారు. కానీ పసుపు శిభిరంలో మాత్రం నేనూ మా ఆవిడ అన్న తరహాలో మాకు వంద జనసేనకు 30 సీట్లు అనుకుంటూ కలలు కంటున్నారు.


జనసేనకు గోదావరి జిల్లాల్లో బలం ఉందని కచ్చితంగా కొన్ని సీట్లు గెలుస్తుందని టీడీపీ భావిస్తోందట.  అయితే జనసేనలో ఆ నమ్మకం లేకపోవడమే అసలైన విడ్డూరం. ఎక్కడా జగన్ గెలవకూడదు, మేమూ పవనే గెలవాలి. ఒకవేళ వస్తే హంగు రావాలి. ఇదీ టీడీపీ ఆలోచనా ఆశగా కనిపిస్తోంది. అయినా వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఆలోచన చేసుకోవచ్చు. కానీ ఈవీఎం లో ప్రజా తీర్పు నిక్షిప్తం అయిపోయిందన్న సంగతి తెలిసే మాట్లాడుతున్నారా అన్నదే ఇక్కడ ప్రశ్నగా ఉంది.
ఇక హంగు అంటూ నిన్నటి వరకూ ఆశపడిన జనసేన ఇపుడు ఆ వూసు ఎత్తడంలేదు. కొత్తగా టీడీపీ హంగు పైన మోజు పెంచుకుంతోందంటేనే ఆ పార్టీ ఖేల్ ఖతం అయిపోయిందా అన్న సెటైర్లు పడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: