అవును మొన్నటి పోలింగ్ జరిగన తీరు తెన్నులు చూస్తున్న తర్వాత అదే అనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఓటమిని ఊహిస్తున్న చంద్రబాబు ఈవిఎంలను వ్యతిరేకిస్తున్నారు. దానికి తగ్గట్లే కొన్ని చోట్ల ఈవిఎంలు మొరాయించాయి. దానికితోడు పోలింగ్ మొదలైన దగ్గర నుండి ఓట్లు వైసిపికి అనుకూలంగా పడుతున్నట్లు ఫీడ్ బ్యాక్ వచ్చింది. దాంతో చంద్రబాబు మెషీన్లకు వ్యతిరేకంగా తన గొంతును ఒక్కసారిగా పెంచేశారు.

 

ఇక్కడ విచిత్రమేమిటంటే, ఈవిఎంలో తాను వేసిన ఓటు తనకే పడిందా ? తాను వేసిన ఓటు తన పార్టీకి పడిందా ? అనే పనికిమాలిన డౌటును లేవనెత్తారు. చంద్రబాబుతో కుటుంబమంతా భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణికి అనుమానం రాలేదు. పోనీ టిడిపి తరపున పోటి చేసిన అభ్యర్ధుల్లో ఏ ఒక్కరూ అనుమానం వ్యక్తం చేయలేదు.

 

అలాగే ఓట్లు వేసిన సుమారు 3.10 కోట్లమంది ఓటర్లలో కూడా ఏ ఒక్కరికీ రాని అనుమానం ఒక్క చంద్రన్న మాస్టారుకే వచ్చిందంటే ఏమనర్ధం ? రేపటి ఓటమికి సాకులు వెతుక్కుంటున్నట్లే కదా ?  పోలింగ్ మొదలైన రెండు గంటలకే రీ పోలింగ్ జరగాలని చంద్రబాబు డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. సరే ఈవిఎంలు మొరాయించటం, దాన్ని బావు చేయించిన తర్వాత మళ్ళీ ఓటింగ్ మొదలవ్వటం ఎప్పటి నుండో జరుగుతున్నదే. అంతమాత్రానికే ఈవిఎంల వ్యవస్ధ నుండి మళ్ళీ బ్యాలెట్ ఓటింగ్ కు మళ్ళాలన్న చంద్రబాబు డిమాండ్ లో అర్ధంలేదు.

 

సాంకేతికలో ఎక్కడైనా అవరోధాలు ఎదురైతే వాటిని అధిగమించుకుంటు పోవాలి. అంతేకానీ మళ్ళీ పాతకాలానికి వెళ్ళిపోదమని చంద్రబాబు లాగ ఎవరూ డిమాండ్ చేయరు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఓటింగ్ ఈవిఎంల ద్వారా జరపాలా ? లేకపోతే బ్యాలెట్ పద్దతిలో జరపాలా ? అనే విషయంలో జనాలు నుండికానీ లేకపోతే టిడిపి నుండే మద్దతు దొరుకుతున్నట్లు లేదు.

 

పోలింగ్ సరళిని గమనించిన తర్వాత ఏ ఒక్క టిడిపి అభ్యర్ధి కానీ నేత కానీ పేపర్ బ్యాలెట్ లోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయలేదు. అందుకే ఇదే డిమాండ్ తో ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబుకు చివరకు మిత్రపక్షాల నుండి కూడా మద్దతు దొరకలేదు. అందుకే జనాలంతా ఒకవైపు చంద్రబాబు ఒక్కడూ ఒకవైపు అన్నట్లైంది పరిస్ధితి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: