ఈ నెల 11 న ఏపిలో అసెంబ్లీ, లోక్ సభ పోలింగ్ అయిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఈవీఎంలలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఏకంగా ఈసీనే తప్పుపడుతున్నారు.  కాగా, పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని..చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. 

తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో వీవీ ప్యాట్స్ స్లిప్పులు కలకలం సృష్టిస్తున్నాయి.  ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో 200 వీవీప్యాట్‌ స్లిప్పులని విద్యార్ధులు కనుగొన్నారు. వెంటనే ఉపాధ్యాయులకు తెలపడంతో వారు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలను తనిఖీ చేసిన ఆర్డీవో.  ర్యాండమైజేషన్ స్లిప్స్ అయి ఉండొచ్చని భావిస్తున్న అధికారులు.

అయితే నిబంధనల మేరకు ర్యాండమైజేషన్‌ స్లిప్పులను భద్రపరచాల్సిన అవసరం ఉందన్నారు.  కలెక్టర్‌ ద్వారా విషయాన్ని తెలుసుకొని పాఠశాలకు వచ్చిన ఆర్డీవో బృందానికి అనేక కవర్లలో స్లిప్పులు దొరికాయి.  ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న కలెక్టర్.   ఇప్పటికే  ఈవీఎంలపై పలు రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: