మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు. ఇదిగో పులి అంటే అదుగో తోక వైసీపీ కార్యాల‌యం లోట‌స్ పాండ్‌లో దొరికింది అనే టైపులో కామెంట్లు చేసే ర‌క‌మ‌ని అంద‌రికీ తెలిసిందే. అప్పుడెప్పుడో సీఎం చంద్ర‌బాబు ప్ర‌పంచ‌స్థాయి ఇంజ‌నీర్ల‌తో ని ర్మించిన తాత్కాలిక స‌చివాల‌యం చిన్న వాన‌కే నీటి మ‌ట్ట‌మైంది. ముఖ్యంగా విప‌క్ష నేత జ‌గ‌న్ చాంబ‌ర్ త‌డిసిపో యింది. ఏసీల‌లోంచి నీళ్లు లీక‌య్యాయి. ఈ స‌మ‌యంలో సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాల్సిన మంత్రి దేవినేని ఉమా.. దీనికి వైసీపీ కుట్ర ఉంద‌ని, ప్ర‌భుత్వాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించాల‌నే ఇలా చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. తీరా .. దీనిపై పోలీసుల‌తో సిట్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి నిర్మాణంలో లోపాలే ఉన్నాయ‌ని తేల‌డంతో నాలిక క‌రుచుకున్నారు., 


ఇక‌, ప‌ట్టిసీమ ప్రాజెక్టు విష‌యంలోనూ అప్ప‌ట్లో ఒక చోట గండి ప‌డింది. దీనికి కూడా వైసీపీనే కార‌ణ‌మ‌ని దేవినేని ఉమా మీడియా స‌మావేశం పెట్టి ఆద‌రాబాద‌రాగా ఈ క్రెడిట్ మ‌రొక‌రికి వెళ్ల‌కూడ‌దు అనుకున్నారో ఏమో.. వైసీపీ కుట్ర వ‌ల్లే గండి ప‌డింద‌ని చెప్పుకొచ్చారు. దీనిపైనా సిట్ వేశారు. నివేదిక మాత్రం గోప్యంగా ఉంచారు. ఇలా అయిన దానికి కాని దానికీ మంత్రి ఉమా ఇలా రెచ్చిపోవ‌డం, ఆన‌క నిజాలు తెలుసుకుని నాలిక క‌రుచుకోవ‌డం ష‌రా మామూలుగా మారిపోయింది. ఇక ఇప్పుడు ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత కూడా ఆయ‌న వైసీపీపై చూపిస్తున్న ప్ర‌తాపం అంతా ఇంతా కాదు. ఇటీవ‌ల రెండు రోజుల కింద‌ట వైసీపీ అధినేత జ‌గ‌న్ పేరుతో ఓ నేమ్ ప్లేట్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. 


``ఆంధ్ర‌ప్ర‌దేశ్ హాన‌ర‌బుల్ చీఫ్ మినిస్ట‌ర్ శ్రీ వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి`` అని బంగారు వ‌ర్ణంలో త‌యారు చేసిన నేమ్ ప్లేట్ ఒక‌టి వాట్సాప్ గ్రూపుల్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే, ఇది వైసీపీ కార్య‌క‌ర్త‌లు కావాల‌ని చేశారా?  లేక వైసీపీని భ్ర‌ష్టు ప‌ట్టిం చే ఓ వ‌ర్గం కావాల‌ని ఇలా ముందుగానే కూసిందో? అనేది ఇప్ప‌టికీ స‌స్పెన్స్‌గానే ఉంది. మ‌రి దీనిలోతుపాతుల‌పై మేధా వుల‌కు, ప్ర‌జ‌ల‌కు కూడా అనేక సందేహాలు ఉంటే.. మంత్రి ఉమా మాత్రం ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ఈ నేమ్ ప్లేట్ ను జ‌గ‌న్ త‌యారు చేయించుకుని తానే ముఖ్య‌మంత్రి అయిపోయిన‌ట్టు ప్ర‌చారం చేసుకుంటున్నాడ‌ని, ఇది పిచ్చికి ప‌రా కాష్ట అని దుమ్మెత్తి పోశారు. అదేస‌మ‌యంలో ఎన్నిక‌ల ప్రక్రియ‌పైనా విమ‌ర్శ‌లు చేశాడు. కానీ, ఇక్క‌డ నేమ్ ప్లేట్ విష యంలో నిజానిజాలు తెలుసుకోకుండానే ఉమా ఇలా నోరుపారేసుకోవ‌డంపై నెటిజ‌న్లు స‌హా ప్ర‌జ‌లు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాను న‌మ్ముకున్న ఉమా అడ్డంగా బుక్క‌య్యాడ‌ని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: