ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్‌ మరోసారి డిల్లీలో రచ్చ రచ్చే చేశారు. ఈసీ తీరుపై చంద్రబాబు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు. తాను నెలల తరబడి ఇదే విషయం చెబుతున్నా ఎవరూ పట్టిచుకోలేదని.. ఇప్పుడు చంద్రబాబు మేల్కొన్నారని పాల్ అంటున్నారు.


ఈవీఎం మిషన్లను దుర్వినియోగం చేస్తున్నారని.. చెబుతూ.. ఈ పాపంలో రష్యా, ఇరాన్‌ వంటి దేశాలకూ భాగం ఉందని చెప్పారు. అంతే కాదు.. ఈ అంశంపై తాను ఐక్య రాజ్యసమితి ప్రతినిధులతోనూ మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు.నాటో దేశాలు, ఆఫ్రికా దేశాలతోనూ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంపై చర్చిస్తానని పార్ చెబుతుంటే వినడం విలేఖరుల వంతయింది.


అంతే కాదు. పాల్‌ ఈ వివాదంలోకి సినిమా నటులనూ లాగుతున్నారు. భారత ప్రజాస్వామ్యం మేలుకోరే.. షారూఖ్ ఖాన్ వంటి వారు కూడా బయటకు వచ్చి తమ పోరాటానికి మద్దతు తెలపాలని కేఏ పాల్ అంటున్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని.. ఇప్పుడు మేలుకొనకపోతే.. ఏపీకి జరిగిన అన్యాయమే అన్ని రాష్ట్రాలకూ జరుగుతుందన్నారు.


అందుకే భారత్‌లో తక్షణం ఎన్నికలను నిలిపేయాలన్నారు. ఇప్పుడు కేవలం ఒక్క దశ మాత్రమే ఎన్నికలు జరిగాయని.. కాబట్టి ఆపేయడం వల్ల ఇబ్బందేమీలేదని కే ఏ పాల్ చెప్పుకొచ్చారు. ఒక విషయానికి మరో విషయానికి పొంతన లేకుండా సాగిన కేఏ పాల్ ప్రసంగం చూసి విలేఖరులు బిత్తరపోయారు. పాపం.. తెలుగు విలేఖరులకు అలవాటే కాబట్టి వెంటనే తేరుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: