ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని ఓ సామెత.. దాని సంగతేమో కానీ.. దాదాపు ఆరేళ్ల రాజకీయంతో చంద్రబాబు ప్లేసులోకి జగన్.. జగన్ ప్లేసులోకి చంద్రబాబు వచ్చేశారు. ప్లేస్ అంటే పదవి కాదండోయ్.. మరేంటి అంటారా పూర్తిగా చదవండి మీకే తెలుస్తుంది. ఆరేళ్ల క్రితం జగన్ ఎలా ఉండేవాడు., వీర ఆవేశంగా ఉండేవాడు..నోటికి ఏది వస్తే అది మాట్లాడి పలుచన అయ్యేవాడు. 


విపరీతమైన కోపం, మా నాన్న పదవి నాకు ఎందుకు ఇవ్వలేదన్న ఉ‌క్రోషం అడుగడుగునా కనిపించేవి.. అప్పట్లో చంద్రబాబు డీసెంట్ గా ఉండేవారు. గతంలో చంద్రబాబుకు రాజకీయాల్లో మంచి పేరు ఉండేది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మాట తూలే వారు కాదు. 

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడి.. మిగిలిన సమయంలో అభివృద్ధి గురించే ఆలోచించేవారన్న పేరు ఉండేది. ఇప్పుడు ఈ సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు జగన్ చాలా మారాడు. ఆవేశంగా మాట్లాడటం లేదు. వినయం పెరిగింది. సంయమనం పెరిగింది. ఎన్నికల ప్రచారంలోనూ ఇది కనిపించింది. 

ఇప్పుడు చంద్రబాబులో ఆనాటి జగన్ లక్షణాలు కనిపిస్తున్నాయి. విపరీతమైన ఆవేశం.. నోటికి ఏది వస్తే అది మాట్లాడేయడం.. అడ్డదిడ్డంగా వాదించడం.. నేనేం చెబితే అదే రైటు అనే ధోరణి పెరింగిందన్న విమర్శలు వస్తున్నాయి. అందుకే  బాబు ప్లేస్‌లోకి జగన్‌, జగన్‌ ప్లేసులోకి బాబు వచ్చేసినట్టు కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: