ఏపీ ఎన్నికల్లో ఈసీ అడ్డగోలుగా వ్యవహరించిందని వాదిస్తున్న చంద్రబాబు నేరుగా రాజ్యాంగ బద్ద సంస్థపైనే యుద్ధానికి బయలుదేరారు. తన ఐటీ సలహదారు వేమూరి హరిప్రసాద్ తో పాటు మరికొందరు మంత్రులను వెంటేసుకుని ఈసీ మందుకు వెళ్లారు..


చంద్రబాబు వాదనను విన్న ఈసీ.. కావాలంటే చర్చకు సిద్ధమని ప్రకటించింది. మా టెక్నికల్ టీమ్ మీ అనుమానలు తీరుస్తాని చెప్పింది. అప్పుడు చంద్రబాబు తన తురుపు ముక్క వేమూరి సింహప్రసాద్‌ ను ప్రయోగించాలని తలచారు. 

కాన ఇక్కడే ఈసీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.. ఓ కేసులో నిందితుడుగా ఉన్న హరిప్రసాద్‌తో తాము చర్చించేది లేదని.. వేరే ఎవరినైనా పంపమని ఓ లేఖ రాసింది. దీంతో చంద్రబాబు వ్యూహం ఎదురుతన్నినట్టు అర్థమవుతోంది. సదరు హరిప్రసాద్ ఎవరంటే.. 2010లో ఈవిఎంను చోరీ చేసిన కేసులో హరిప్రసాద్ నిందితుడట.

ఈ మేరకు ఈసీ అతని వివరాలు తెలుపుతూ టీడీపీకి లేఖ రాసింది. తన వ్యూహం ఫలించకపోవడంతో టీడీపీ ఇప్పుదు కొత్త వాదన వినిపిస్తోంది. ఈవిఎంలు, వివీ ప్యాట్ ల పనితీరుపై చర్చించడానికి ఇష్టం లేకనే ఈసీ హరిప్రసాద్ ను సాకుగా చూపుతోందని టీడీపి వర్గాలంటున్నాయి. అదీ సంగతి. 



మరింత సమాచారం తెలుసుకోండి: