ఆంధ్ర ఎన్నికలు వైస్సార్సీపీ పార్టీకి స్పష్టమైన అధికారం ఇవ్వబోతుందని ఇప్పటికే అందరూ ఫిక్స్ అయిపోయారు. 2014లో కంటె ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ఎక్కువ‌గా గెలుపు ప‌వ‌నాలు వైసీపీవైపే వీస్తున్నాయి. రాష్ట్రానికి కాబోయె సీఎం ఎవ‌రంటే మెజారిటీ జ‌నాల‌నుంచి జ‌గ‌న్ అనే పేరు వినిపిస్తోంది. అన్ని స‌ర్వేలు వైసీపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ సీఎం అవుతార‌ని తేల్చి చెప్పాయి. ఇద‌లా ఉంటె జ‌గ‌న్‌కు కేంద్ర హోంశాఖ మ‌రింత సెక్యూరిటీని పెంచింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.


అస‌లు విష‌యానికి వ‌స్తే …పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో విశాఖ ఎయిర్‌పోర్టులో జ‌గ‌న్ పై హత్యాయత్న‌ప్ర‌య‌త్నం జ‌రిగిని విష‌యం తెలిసిందే. అత్యంత క‌ట్టుదిట్ట‌మైన ఏయిర్ పోర్ట్‌లాంజ్‌లో శ్రీనివాస్ అనే యువ‌కుడు కోడి క‌త్తితో దాడి చేసి గాయ‌ప‌రిచారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడి అనంతరం అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న జగన్ నేరుగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. దాడి అనంత‌రం కేంద్ర జ‌గ‌న్‌కు భ‌ద్ర‌త‌ను క‌ట్టి దిట్టం చేసిన సంగతి తెలిసిందే.


తాజాగా జ‌గ‌న్ కు మ‌రింత హై సెక్యూరిటీని కేంద్ర హోంశాఖ కేటాయించింది. 11న జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాష్ట్రానికి కాబోయె సీఎం జ‌గ‌నే అని ఇంట‌లిజెన్స్ స‌ర్వే రిపోర్ట్‌ను కేంద్ర‌హోంశాఖ‌కు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. దాంతో సెంట్ర‌ల్ హోమ్ అఫైర్స్ క‌మిటీ హైసెక్యూరిటీని అలాట్ చేసిన‌ట్లు స‌మాచారం. మ‌రో వైపు జ‌గ‌న్ బాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కూడా రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. ఈ నేప‌ధ్యంలో జ‌గ‌న్ కు సెక్యూరిటీని పెంచాల‌ని వైసీపీ నేత‌లు డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: