ఎన్నికల ఫలితాల్లో పారదర్శకత నిరూపణ కోసం 50% వీవీప్యాట్‌లు లెక్కించాలన్న ప్రతిపక్షాల వాదనను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా తోసి పుచ్చారు. "రోగ నిర్ధరణకు రక్త పరీక్షలు చేయాల్సి వచ్చిన ప్పుడు రక్త నమూనా లు ఒక చోట తీసుకుంటామా లేదంటే 20 చోట్ల నుంచి సేకరిస్తామా?" అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 45 ఈవీఎం లలోనే సమస్య వచ్చినట్లు తెలిపారు. ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలు మొత్తం 90000 అందులో సమస్య లకు గురైన ఈవీఎం లు 45 మాత్రమే అంటే 0.05 శాతం అన్నమాట (దీనికే చంద్రబాబు దేశవ్యాప్త సినిమా వేశారు) తొలిదశ ఎన్నికల నిర్వహణ తీరుపై సోమవారం ఒక జాతీయ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Image result for sunil arora iec about 50% VV Pat count

"వీవీప్యాట్‌ల అంశంపై మేం సమర్పించిన ప్రమాణ పత్రం ఆధారంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అయిదు వీవీప్యాట్‌లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అప్పటికప్పుడు నిర్ణయించు కొని (ర్యాండం) ఎంపిక చేసి లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ ఆదేశాలను అమలు చేయాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు ఆదేశాలు జారీచేశాం. దీనిపై రాజకీయ పార్టీలు మళ్లీ కోర్టుకు వెళ్లాలనుకుంటున్నట్లు మీడియాలో చూశాను. ఒకవేళ కోర్టు అడిగితే మా అభిప్రాయాలను మళ్లీ చెబుతాం. ఈవీఎంలను రెండు దశాబ్దాల నుంచి దేశంలో ఉపయోగిస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీవీప్యాట్‌ల ఏర్పాటు జరిగింది. ఉదాహరణకు  వ్యక్తికి రక్తపరీక్షలు చేయాలంటే నమూనాలను ఒకచోట నుంచి తీసుకుంటారా? శరీరంలోని 20 చోట్ల నుంచి తీసుకుంటారా? ఈవీఎంలపై విమర్శలు ఆవేదనాభరితం" అని అరోరా అన్నారు.

Image result for sunil arora iec about 50% VV Pat count

2014సార్వత్రిక ఎన్నికల్లో ఒకపార్టీ గెలిస్తే, 2015లో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోపార్టీ గెలిచిన విషయాన్ని సునీల్‌ అరోరా గుర్తుచేస్తూ ఇప్పటివరకూ ఈసీఐ 1500 వీవీప్యాట్‌ లు లెక్కిస్తే అవన్నీ ఈవీఎంలతో సరిపోయాయని తెలిపారు.


"ఈవీఎం లు దేనికి అదే ప్రత్యేకం, ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండవు కాబట్టి వాటిని ట్యాంపర్‌ చేయలేరు. అవి సరిగా పనిచేయక పోవచ్చు తప్పితే ట్యాంపర్‌ కు వీలుకాదు. ఆంధ్రప్రదేశ్‌ లో ఈవీఎంల వైఫల్యంపై పూర్తిస్థాయి వివరాలు సేకరించి చార్ట్‌ తయారు చేశాం. 11వ తేదీ ఉదయం 10గంటలకు నాకు ఫోన్‌ వచ్చినప్పుడు 35% ఈవీఎంలు పనిచేయడం లేదనిచెప్పారు. 11.30గంటలకు నివేదిక అడిగితే 45మాత్రమే పనిచేయలేదని చెప్పారు. ఆ సంఖ్యలో కొంతతేడా ఉండొచ్చు. కానీ తీవ్ర ఆందోళన కర పరిస్థితి మాత్రం లేదు.

Image result for sunil arora iec about 50% VV Pat count

"45వేల ఈవీఎంల్లో 45 మాత్రమే సరిగా పనిచేయలేదు. ఆ ఎన్నిక కోసం మేం 90000 ఈవీఎంలు తరలించాం. గత ఏడాది జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో 175000 ఈవీఎంలు ఉపయోగించి నప్పుడు కేవలం ఆరు ఈవీఎంల విషయంలో ప్రసార మాధ్యమాలు విస్తృత ప్రచారం కల్పించాయి. ఆ ఆరు కేసుల్లో బాధ్యులైన వారిని సస్పెండ్‌ చేశాం" అని అరోరా  వెల్లడించారు.

Image result for sunil arora iec about 50% VV Pat count

సుప్రీంకోర్టు సూచించిన విధంగా ఒక్కోనియోజకవర్గానికి ఎంపికచేసే అయిదు వీవీప్యాట్‌లే కాకుండా తమకు అనుమానం ఉన్న పోలింగ్‌ బూత్‌కు సంబంధించిన వీవీప్యాట్‌ నూ లెక్కించాలని పోటీలో ఉన్న అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చని అరోరా వెల్లడించారు. ఆ దరఖాస్తుపై రిటర్నింగ్‌ అధికారి అనుమతిస్తూనో, తిరస్కరిస్తూనో మౌఖిక ఆదేశాలు జారీ చేయొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇప్పటికే ₹2600 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇది అత్యంత దురదృష్టకరం. దీనిపై రాజకీయపార్టీలన్నీ పూర్తిగా ఆలోచించు కోవాలని  అరోరా  సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: