రాను రాను భారత దేశ రాజకీయాలు ఎవరూ వూహించని మలుపు తీసుకుంటున్నాయి. దేశంలో పేరుకు పార్టీలు చాలానే ఉన్నాయి. జాతీయ పార్టీలు అని చెప్పుకునే పార్టీలు ఉన్నాయి. కానీ ఆయా పార్టీలు తమ రాష్ట్రాలను దాటి రాని పరిస్థితి ఉంది. ఇపుడు దేశంలో జాతీయ పార్టీలుగా చెప్పుకోవాలంటే మొదట బీజేపీనే చెప్పాలి.


ఐతే బీజేపీ కూడా దక్షిణాదిన కర్నాటక తప్ప మిగిలిన చోట్ల ప్రభావం చూపని ఉత్తరాది పార్టీగా ఉంది. ఐదేళ్ల మోడీ పాలనతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉనికి కోల్పోయింది. ఇదెలా ఉన్నా బీజేపీయే ఇపుడు దేశంలో అన్నింటి కంటే పెద్ద పార్టీగా ఉంది. ఆ పార్టీలోనే ఎక్కువ మంది నాయకులు కూడా కనిపిస్తున్నాయి. మే 23 వరకూ జరిగే ఎన్నికల్లో చూసుకుంటే దేశంలో మళ్ళీ ఎవరు రాజకీయం నెగ్గుతుంది అన్న డౌట్లు వస్తున్నా ముందు వరసలో బీజేపీయే ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.


మోడీని మించిన మొనగాడు ప్రతిపక్షాల్లో ఇప్పటికీ  కనిపించడం లేదు. కాంగ్రెస్ లో రాహుల్  గాంధి మోడీ సరి సాటి కాదని సర్వేలు తేల్చేస్తున్నాయి. ఆయన గారి చెల్లెలు  ప్రియాంక గాంధి కూడా పెద్దగా ప్రభావం చూపించే అవకాశలు లేవు. ఇక మమతా బెనర్జీ బెంగాల్ కే పరిమితం, మాయావతి ఉత్తరప్రదేశ్ రాజకీయల్లోన పోటీ ఎదుర్కొంటున్నారు. ఇక శరద్ పవర్, ఫారూక్ అబ్దుల్ల వంటి వారు రిటైర్ ఐయారనే చెప్పాలి. దక్షిణాన చంద్రబాబు, చంద్రశేఖర రావు డిల్లీని శాసించే పరిస్థికి అయితే లేదు. ముఖ్యంగా చంద్రబాబుకు ఏపీలోనే గడ్డు పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఈ నేపధ్యం చూసుకున్నపుడు మళ్ళీ మోడీయే ప్రధాని అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: