ఎన్నికలు అంటే సాధారణంగా ఎవరికీ ధీమా ఉండదు. అసలు రాజకీయాల్లో ధీమా అసలు ఉండదు. ఎందుకంటే ఇది జనంతో కూడుకున్న వ్యవహారం. ఎపుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఎవరికీ తెలియదు. అందువల్ల కుదురుగా ఉన్నామని ఎవరు అనుకున్నా పొరపాటే. కానీ ఉన్నంతలో కొంత నిబ్బరం దొరికిందని అనుకున్న వారు కూడా ఉన్నారు.


ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆ తేడా బాగా కనిపిస్తోంది. పొరుగున ఉన్న కే చంద్రశేఖర రావు నాలుగు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు పెట్టుకుని మంచి మెజారిటీతో గెలిచారు. ఇపుడు కేవలం ఎంపీ ఎన్నికలు. పైగా ఓ వైపు ఏకపక్షంగా అసెంబ్లీ సీట్లను గెలిచిన అనుభవం. దాంతో ఈసారి కూడా విపక్షాల  కంటే వేగంగానే దూసుకెళ్ళారు. ప్రచారం చేసుకున్నారు. కచ్చితంగా 16కి 16 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమాగా ఉన్నరు. కేంద్రంలో ఎవరు వచ్చినా నాలుగు మంత్రి పదవులు తమకు ఖాయమని కూడా లెక్కలు వేసుకుంటున్నారు.


మరి ఏపీ విషయానికి వస్తే అసెంబ్లీ, పార్లమెంట్ రెండూ ఒకేసారి జరిగాయి. పోటా పోటీగా పరిస్థితి ఉంది. దాంతో ఇక్కడ అధికారంలో ఉన్న చంద్రబాబు  గెలుస్తామని ధీమాగా చెప్పలేకపోతున్నారు. అధికారంలోకి వస్తామని టీడీపీ గట్టిగా అనలేకపోతోంది. మరో వైపు జగన్లో ధీమా కనిపిస్తోంది. అయితే గతసారి దెబ్బ తిని ఉండడం వల్ల వైసీపీలోనూ కొంత గుబులు వ్యక్తం  అవుతోంది. దాంతో ఓ విధంగా ఫలితాలు వచ్చేవరకూ తరువాత ఎత్తుగడలు ఏంటన్నది రెండు పార్టీలు చెప్పలేని పరిస్థితి. అదే కేసీయార్ అయితే అపుడే కేంద్ర మంత్రి పదవుల వరకూ వచ్చేశారు


మరింత సమాచారం తెలుసుకోండి: