ఇటీవల కొందరు తక్కువ టైమ్‌లో పాపులార్టీ కోసం సంచలనాలు క్రియేట్‌ చెయ్యడం అలవాటుగా మార్చుకున్నారు. ప్రీ పబ్లిసిటీ కోసం ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్‌ చెయ్యడం వెంటనే వార్తల్లోకి ఎక్కడం ఆ తర్వాత పాపులర్‌ అయిపోవడం చకచకా జరిగిపోతున్నాయి. ఇటీవల కొందరు హాట్‌ హీరోయిన్లు సైతం వార్తల్లో నిలిచేందుకు ఏదో ఒకటి చేస్తు వస్తున్నారు. తాజాగా కొందరు హీరోయిన్లు టాప్‌ పొలిటికల్‌ లీడర్లపై హాట్‌ హాట్‌ కామెంట్లు చెయ్యడం ద్వారా వార్తల్లో పతాక శీర్షికలకు ఎక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మోడట్‌, నటీమణీ మహికా శర్మ కూడా ఇలాగే ట్రై చేసినట్టు అనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల మూమెంట్‌ జోరుగా ఉన్న టైమ్‌లో ఆమె ఏకంగా ఏ.ఐ.సీ.సీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని లక్ష్యంగా చేసుకుని ఓ హాట్‌ హాట్‌ కామెంట్‌ చేసింది. మహిక రాహుల్‌ను ప్రేమిస్తున్నట్టుగా ప్రకటించుకుంది. 


ఇంకేముంది మీడియా ఫోకస్‌ ఒక్క సారిగా మహికాపై పడింది. గతంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ సైతం రాహుల్‌ అంటే ఇష్టమని ప్రకటన చేసి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ‌ మహికా చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అసలే రాహుల్‌ బ్యాచిలర్‌, పైగా రేపు కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వస్తే దేశానికి కాబోయే ప్రధాన మంత్రి. అలాంటి వ్యక్తిని ప్రేమిస్తున్నానని ఎవరైనా చెబితే అది ఎలా వైరల్‌ అవుతుందో ప్రత్యేంగా చెప్పక్కర్లేదు. ఈ ఛాన్స్‌నే మహికా శర్మ ఉపయోగించుకున్నట్లు ఉంది. రాహుల్‌ తనను ఎందుకు ఆకట్టుకున్నాడో కూడా మహిక శర్మ వివరించింది. రాహుల్‌ తన ప్రసంగాలతో ప్రజలను నవ్విస్తూ ఉంటాడు. అందుకే ఆయన అంటే నాకు చాలా ప్రేమని చెప్పింది. 


మహికా శర్మ వ్యాఖ్యలు ఎలా ఉన్నా ఇంతకూ ఆమె రాహుల్‌ అంటే ఎందుకు ఇష్టమో చెప్పిన దానిని బట్టి చూస్తే ఆమె రాహుల్‌ను పొగిడిందా ? లేదా విమర్శించిందా ? అన్నది మాత్రం అర్థం చేసుకోవడం కాస్త కష్టమే. ఇక తాజా లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ తన సొంత నియోజకవర్గమైన అమేథీతో పాటు దక్షిణాదిలో కాంగ్రెస్‌కు ఊతమిచ్చేందుకు కేరళ‌లోని వ‌య‌నాడ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వ‌య‌నాడ్‌ కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక్కడ నుంచి గత కొన్ని దశాబ్దాలుగా పార్టీ ఓటమి లేకుండా విజయాలు సాధిస్తు వస్తోంది. ఈ క్ర‌మంలోనే రాహుల్ రెండు చోట్ల పోటీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: