చంద్రబాబు రోజురోజుకూ తన అంచనాలు పెంచుతున్నారు. ఎన్నికలు ముగియగానే 130 సీట్లు వస్తాయని అంచనా వేసిన ఆయన.. ఆ తర్వాత ఆ సంఖ్యను 150కు పెంచారు. మరి చంద్రబాబు ధీమా ఏంటి... ఆయన ఎందుకు అంత ధీమాగా చెబుతున్నారు. అనే అంశంపై ప్రొఫసర్ కె.నాగేశ్వర్ చక్కగా విశ్లేషించారు. 


చంద్రబాబు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ 150 సీట్లు సాధిస్తే అది వండర్ అవుతుందంటున్నారు నాగేశ్వర్. పెద్ద ఎత్తున తరలి వచ్చి.. ప్రభుత్వానికి ఓటు వేశారని చెబుతున్నారు.  మహిళలు పెద్ద ఎత్తున.. ఏ కారణం లేకుండా అర్థరాత్రి లేకుండా క్యూలో నిలబడి ఓటు హక్కును ఎందుకు వినియోగించుకుంటారన్నది  చంద్రబాబు అంచనాగా నాగేశ్వర్ చెబుతున్నారు.

రైతుల కోసం అన్నదాత సుఖీభవ, డ్వాక్రా మహిళలకు పసుపు – కుంకుమ సహా ప్రభుత్వ పథకాల ప్రకటనలన్నింటిలోనూ భావోద్వేగం పెంచేలా చేయగలిగారు. వీటన్నింటి వల్ల ప్రభుత్వ సానుకూలత ఓట్లు టీడీపీకి వస్తాయని.. చంద్రబాబు అంచనా వేస్తున్నారని నాగేశ్వర్ అంటున్నారు. ముఖ్యంగా మహిళల్లో బయటకకు కనిపించని సానుకూలత ఉందని.. అంచనా వేస్తున్నారు. అభ్యర్థులను పట్టించుకోవద్దని.. తననే అభ్యర్థిగా భావించాలని చంద్రబాబు పిలుపునిచ్చిన విషయాన్ని నాగేశ్వర్ గుర్తు చేస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీ మహిళల ఓటింగ్ పై ఎక్కువ నమ్మకం పెట్టుకుంది. అలాగే అమరావతి, పోలవరం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. అన్నీ మధ్యలో ఉన్న సమయంలో.. ఇప్పుడు డ్రైవర్ ని మారిస్తే ఎలా అన్న చర్చ ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీన్ని ప్రజలు నమ్మారని చంద్రబాబు గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే ఆయన తనకు 150 సీట్లు వస్తాయని చెబుతున్నారని నాగేశ్వర్ విశ్లేషించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: