తెలుగు సినీ సీమను ఏలిన నటీమణులలో ఆ ఇద్దరికీ ప్రత్యేక స్థానం ఉంది. వారు నటించిన సినిమాలు వారేంటో చెబుతాయి. అందంతో పాటు అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు. ఓ విధంగా ఆ ఇద్దరు తెలుగు ప్రజల ఆస్తి.  వారి కీర్తి  తెలుగు రాష్ట్రాలను దాటింది. అంతగా రాణించినా ఆ ఇద్దరు ఇపుడు సరిగ్గా ఒకే సమయంలో ఒకే విధమైన అవమానాన్ని ఎదుర్కొన్నారు.


ముందుగా మన తెలుగు అందాల తార జయప్రద గురించి చెప్పుకోవాలంటే ప్రఖ్యాత   డైరెక్టర్ సత్యజిత్ రే ఆమె గురించి అభివర్ణిస్తూ ఆమె లాంటి సౌందర్యవతి లేనే  లేదు అన్నారు. ఇక జయప్రద అన్న నందమూరి ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె ఓ పర్యాయం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. అట్నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్ళి సమాజ్ వాది పార్టీ తరఫున రాంపూర్ సీటు నుంచి రెండు పర్యాయాలు ఎంపీగా నెగ్గారు. ఇక లేటెస్ట్ గా ఆమె బీజేపీ నుంచి అదే సీట్లో పోటీ చేస్తున్నారు. అక్కడ సమాజ్ వాది పార్టీ తరఫున పోటీలో ఉన్న అజాంఖాన్ జయప్రదపై ఆడిపోసుకున్నారు అనరాని మాటలు అన్నారు. ఆమె గురించి అసభ్యంగా మాట్లాడారు.


ఇక కన్నసీమను మెట్టినిల్లుగా చేసుకున మరో టాప్ హీరోయిన్ సుమలత విషయానికి వస్తే ఆమె ఇపుదు తన భర్త, ప్రముఖ నటుడైన దివంగత అంబరీష్ ప్రాతినిధ్యం వహించిన మంద్య లోక్ సభ సీటు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. అక్కడ తన కుమారుడి నిఖిల్ గౌడను వారసునిగా పెట్టిన కర్నాటక సీఎం కుమార స్వామి సుమలత మీద ఇదే విధంగా ఆడిపోసుకున్నారు. భర్త చనిపోయిన వెంటనే ఇలా రోడ్డు మీదకు రావడమేంటని కూడా కుమారస్వామి దారుణంగా మాట్లాడారు.


మహిళలు, వారి అభివ్రుద్ధి అంటూ నిత్యం మాట్లాడే నాయకులే వారు పోటీ చేస్తే సహించలేరు. వారు బయటకు వచ్చి పోరాడితే వూరుకోలేరు. కారణం ఏంటంటే రాంపూర్ లో జయప్రద గట్టి క్యాండిడేట్. మాండ్యలో సుమలత గెలుపు గుర్రం. అంటే ఆడవాళ్ళు గెలవరాదు. అందుకోసం ఏమైనా అనేస్తారు. మరి వారితో దోస్తీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కనీసం తెలుగింటి ఆడపడుచులపై ఇవేం మాటలని కనీసంగా కూడా అనలేకపోవడం ఇంకా బాధాకరం.


మరింత సమాచారం తెలుసుకోండి: