ఆంధ్ర ఎన్నికల్లో పవన్ పార్టీ ఆశించిన మేర సీట్లు రాబట్టలేదని ఇప్పటికే తెలిసిపోయింది. అయితే తాజాగా జనసేన పార్టీ తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు రెండు సంవత్సరాల క్రితం లీజుకు తీసుకున్న హైదరాబాద్ విజయవాడలోని కార్యాలయాలను మూసివేయడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని మాదాపూర్ లో నడుస్తున్న జనసేన కేంద్ర కార్యాలయాన్ని మాత్రమే కొనసాగించి మిగతా భవనాలను మూసివేయాలని పార్టీ నిర్ణయించడం విశేషం.


జనసేన ఐటీ సెంటర్ నిర్వహించిన భవనం తాజాగా టూలెట్ బోర్డు పెట్టి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో జనసేన దుకాణం మూసివేస్తున్నారని అర్థమైంది. ఈ కార్యాలయం హైదరాబాద్ లోని ఐటీ ఏరియాలో ఉంది. అదిప్పుడు మూసి వేసి ఉండడం.. టూలెట్ పెట్టి ఉండడంతో జనసేన ఆపరేషన్స్ ఆపేసినట్లు స్పష్టమైంది. ఇందులో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగులను తీసుకున్నారు. ఎన్నికలు ముగియడంతో వారికి రావాల్సిన జీతాల బకాయిలు చెల్లించి పంపించినట్టు తెలిసింది. 


అందరూ వెళ్లిపోవడంతో ఇప్పుడు ఐటీ సెంటర్ లో ఎవరూ పనిచేయడం లేదు.ఈ పరిణామాలను గమనిస్తే.. ఏపీలో జనసేన మనుగడ కష్టమని అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. ఆపార్టీ తగినన్ని సీట్లు గెలుచుకోలేదని స్పష్టమవుతోంది. అందుకే పవన్ ముందస్తుగా ఖర్చులు తగ్గించుకునేందుకే జనసేన వివిధ కార్యాలయాలను మూసివేయిస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా ఎన్నికలు ముగియగానే జనసేన కార్యాలయాలు మూతపడడం జనసైనికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: