అవును.. నిజమే.. వై.ఎస్‌.జగన్‌, గౌరవనీయ ముఖ్యమంత్రి.. ఇలా జరుగుతున్న ప్రచారంలో కాస్త కామన్‌ సెన్స్ లోపించింది. వై.ఎస్. జగన్.. తాను ముఖ్యమంత్రి అవబోతున్నానని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 


ఇందులో ప్రధానంగా ఆయన వై.ఎస్.జగన్, గౌరవనీయ ముఖ్యమంత్రి అన్న పేరుతో ఓ నేమ్‌ ప్లేట్ తయారు చేయించుకున్నాడని ఓ ఫోటో వైరల్ అవుతోంది. దీన్ని ఉటంకిస్తూ.. జగన్ కు ఇంత అత్యుత్సాహం పనికిరాదంటూ కామెంట్లు చేస్తున్నారు చాలామంది. 

కానీ ఇక్కడే కామన్ సెన్స్ లోపిస్తోంది. ఎవరైనా ముఖ్యమంత్రి కాకముందే నేమ్‌ ప్లేట్ చేయించుకుంటారా.. వాస్తవానికి ఇలాంటి నేమ్ ప్లేట్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వమే తయారు చేసి ఇస్తుంది. ఇవి ఎవరికి వారు చేయించుకోరు అన్న స్పృహ చాలా మంది కోల్పోతున్నారు. 

మరో విషయం ఏంటంటే.. ఒక వేళ చేయించుకున్నా  దాన్ని ఇలా సోషల్ మీడియాలో పోస్టు చేస్తారా.. అందువల్ల వారికి ఉపయోగం ఉంటుందా.. ఇవన్నీ చిన్నపిల్లవాడికి కూడా వచ్చే అనుమానాలు.. కానీ .. జగన్ పై దుష్ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో కొందరు పనిగట్టుకుని చేసే ఇలాంటి ప్రచారాలు ఏమాత్రం మంచివి కావు.



మరింత సమాచారం తెలుసుకోండి: