దేశవ్యాప్తంగా 2019 ఎన్నికల్లో గోడౌన్లలో ఇళ్ళలో వాహనాలలో పాలవ్యానులలో ఎక్కడబడితే అక్కడ భీభత్సంగా నగదు పట్టుబడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తమిళ నాడు రాష్ట్రాలు ఈ విషయంలో దేశంలో ప్రధమ స్థానం ఆక్రమిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇంత విపరీతంగా నగదు దొరకటం అదీ ఏపి అధికార పార్టీకి చెందిన ప్రధాన నాయకుల వద్ద పన్ను ఎగవేతలు జరగ్గా వారివద్దనే అధిక మొత్తంలో సొమ్ము దొరకటం-డిమోనెటైజేషన్ అమలు కమిటీ కన్వీనర్ గా ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఉండటం ఇదంతా ఫిష్షీగా కనిపిస్తుంది కదా! ఇది యాదృచ్చికమే కావచ్చు.
Image result for heavy cash caught by IT officials in kanimozhi house
కాని, ఆ తరవాత ఆయన మిత్రపక్షం డిఎంకెకి చెందిన ప్రముఖ నాయకుల వద్ద ఐటీ దాడుల్లో అధిక మొత్తంలో లెక్కచెప్పని నగదు దొరకటం కూడా యాదృచ్చికమేనా? అన్న విషయాలు ప్రజల్లో చర్చనీయాంశాలు అవుతున్నాయి.

మొదటి అంతస్థులో పెద్ద యెత్తున నగదు దాచిపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయనే కారణంతో ఐటి అధికారులు పార్లమెంటు సభ్యురాలు, డిఎంకె అధినేత స్టాలిన్ సోదరి కనిమొళి ఇంటిపై దాడులు చేశారు.  మంగళవారం సాయంత్రం టుటికోరిన్ లోని ఆమె ఇంటిలో ఐటి అధికారులు ఎన్నికల కమిషన్ అధికారులను వెంట పెట్టుకుని వచ్చి సోదాలు చేశారు. 
Image result for heavy cash caught by IT officials in kanimozhi house
తమిళనాడులోని 39 లోకసభ స్థానాలకు, 18 శాసనసభా స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. టుటికోరిన్ నుంచి కనిమొళి పోటీ చేస్తున్నారు. పెద్ద యెత్తున నగదు పట్టుబడడంతో ఈసి వెల్లూరు సీటు ఎన్నికను రద్దు చేసింది. డిఎంకె అభ్యర్థి నివాసంలో ఆ నగదు పట్టుబడింది. డిఎంకె కోశాధికారి దురైమురగన్ కుమారుడు కథిర్ ఆనంద్ కు చెందిన గోడౌన్ లో ఈ నెల ఆరంభంలలో ₹11.50 కోట్లు పట్టుబడ్డాయి. వెల్లూరు నుంచి కథిర్ ఆనంద్ పోటీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐటి అధికారులు రూ. 500 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో ధనప్రవాహం అధికంగా ఉందని భావిస్తున్నారు. 

Image result for durai murugan son


కేంద్ర ఎన్నికల సంఘం 

తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ స్థానానికి ఎన్నికలను రద్దు చేస్తున్నట్టు వస్తున్న వార్తలో నిజం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో భారీగా నగదు పట్టుబడటంతో ఈసీ ఎన్నికలను రద్దు చేయనుందనే వార్తలు వచ్చాయి. దీనిపై ఎన్నికల కమిషన్‌ అధికార ప్రతినిధి ఎస్‌ శరణ్‌ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఎన్నికల సంఘం అలాంటి ఉత్తర్వులు జరీ చేయలేదని వెల్లడించారు.
Image result for durai murugan son
ఇటీవల తమిళనాడు లోని చాలా ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో భాగంగా వెల్లూరు పార్లమెంట్‌ డీఎంకే అభ్యర్థి కదిర్‌ ఆనంద్‌ కార్యలయం నుంచి భారీగా నగదు పట్టుబడింది. దీంతో అతనిపై జిల్లా అధికారులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్లపై డబ్బుప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ఈసీ వెల్లూరులో ఎన్నికరద్దు చేయనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. కాగా, సార్వత్రిక ఎన్నికల రెండో దశలో భాగంగా తమిళనాడులోని  అన్ని పార్లమెంట్‌ స్థానా లకు ఏప్రిల్‌ 18 న పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే.  

ECI Says No order Issued For Cancellation Of LS polls in Vellore - Sakshi

మరింత సమాచారం తెలుసుకోండి: