ఏపీలో నేమ్ ప్లేట్ చుట్టూ రాజకీయాలు... రాసిందెవరు... చేసిందెవరు...
 
ఆంధ్రప్రదేశ్‌ లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా 36 రోజుల సమయం ఉంది. అప్పటిదాకా ఎవరు గెలుస్తారన్న అంశంపై ఉత్కంఠ, టెన్షన్ వీడదు. అంతే కాదు అధికార ప్రతిపక్షాలపై పరస్పర విమర్శల జడివాన కొనసాగుతూనే ఉంది. ఆ ఉత్కంఠను అలాగే కొనసాగిస్తూ ప్రతిరోజూ అధికార, ప్రతిపక్ష నేతలు రకరకాల ఆరోపణ లు చేసుకుంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి నేమ్ ప్లేట్ వివాదం ముదురుతుంది.  
Image result for vijaya sai reddy tweet on devineni name plate comment
ఏపీలో ఎన్నికలు ముగిసిన కొద్దిరోజులకే, వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ "నేమ్ ప్లేట్" సోషల్ మీడియా లో కలకలం రేపింది. ఆటోమేటిక్‌ గా దీనిపై తొలి స్పందన తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చింది. ప్రశాంత్ కొషోర్ బృందం చివరి పేమెంట్ కోసం వైఎస్ జగన్మోహనరెడ్డిని భ్రమల్లో ఉంచు తోందని విమర్శించి న ఏపీ మంత్రి దేవినేని ఉమ, "జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేయించు కోవడం పిచ్చికి పరాకాష్ట" అని సెటైర్ వేశారు. 


వెంటనే వైసీపీ నుంచీ కౌంటర్ వచ్చింది. టీడీపీ నేతలే అలాంటి నేమ్ ప్లేట్ సృష్టించి, దానిపై పిచ్చి కూతలు కూస్తున్నారని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. నేం ప్లేట్ ముఖ్యమంత్రి తయారు చేయించుకోరు. దాన్ని ప్రభుత్వమే తయ్యారు చేయిస్తుందన్న ఙ్జానం స్పృహ దేవినేని ఉమా కు లేకపోవటం కుసింత ఆశ్చర్యం కలిగిస్తుంది అంటూ ట్వీట్ పెట్టారు విజయసాయిరెడ్డి.  
Image result for vijaya sai reddy tweet on devineni name plate comment
Vijayasai Reddy V
@VSReddy_MP

ముఖ్యమంత్రి ఆఫీస్ నేమ్ ప్లేట్ ఎవరు తయారు చేయిస్తారో తెలియదా ఉమా? ఎవరూ సొంతంగా తయారు చేయించుకుని ఆఫీసు ముందు తగిలించుకోరు. మీరే ఒక గ్రాఫిక్ నేమ్ ప్లేట్ సృష్టించి దానిపై పిచ్చికూతలు కూస్తున్నారని అందరికీ తెలిసిపోయింది. ఫ్రస్టేషన్ లో మీ మాటలే కాదు చేతలూ అసహ్యం కలిగిస్తున్నాయి

1,166
10:21 ఆం - ఆప్ర్ 16, 2019

మరింత సమాచారం తెలుసుకోండి: