ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచేస్తున్నాయ్.. మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారిపోతున్నాయి.  ఎండ వేడిమి తట్టుకోలేక పశుపక్షాదుల చల్లని ప్రదేశాలు వెతుక్కుంటూ వెళ్తున్నాయి.  అయితే  ఎండాకాలమైనా.. వానాకాలమైనా.. చలికాలమైనా  బతుకు దేరువుకోసం వెళ్లేవారికి కష్టాలు తప్పవని తెలిసిందే.  ఈ క్ర‌మంలోనే ప‌గ‌టి పూట కాలు బ‌య‌ట పెట్టాలంటేనే జ‌నాలు జంకుతున్నారు. ప్ర‌యాణాల‌ను వాయిదా వేసుకుంటున్నారు. మండుతున్న ఎండ‌ల‌కు బ‌య‌ట‌కు వెళ్ల‌లేక‌పోతున్నారు. 

ఇక మోటరు వాహనాలు నడిపే వారికి ఈ ఎండాకలం వచ్చిందంటే..వెన్నుల్లో వణుకు పుడుతుంది.  ఓ వైపు ఎండ..మరోవైపు ఇంజన్ వేడి..తట్టుకోలేక చల్లని పానియాల వైపు పరుగెడుతుంటారు.  అయితే ఎంత ఎండైనా... తన ఆటో ఎక్కితే చల్లని గార్డెన్ లో కూర్చున్న ఫీలింగ్ కలుతుగుందని అంటున్నాడు ఓ ఆటో డ్రైవర్.  అదేంటీ ఆటోలో కూర్చుంటే పైనుంచి ఎండ ఉబ్బరానికి తట్టుకోలేరు కదా అన్న ప్రశ్నలు తలెత్తొచ్చు.  కానీ ఆ డ్రైవర్ చేసి వినూత్న ప్రయోగం చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. 

ప‌శ్చిమ‌బెంగాల్‌లోని కోల్‌క‌తాకు చెందిన బిజ‌య్ పాల్ అనే వ్య‌క్తి ఎన్నో ఏళ్లుగా ఆటో న‌డుపుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. అయితే ఇత‌ను త‌న ఆటోలో ప్ర‌యాణికుల‌ను గ‌మ్య‌స్థానాల‌ను చేరుస్తూ సేవ‌ల‌ను అందించ‌డ‌మే కాదు, మ‌రోవైపు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం త‌న వంతు బాధ్య‌త‌ను కూడా నిర్వ‌ర్తిస్తున్నాడు.  కొంత కాలంగా తన ఆటోలో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన బిజయ్ పాల్ ఎలాగైనా వీరికి ఉపశమనం కలిగించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. త‌న ఆటోపై చిన్న‌పాటి గార్డెన్‌ను ఏర్పాటు చేశాడు.

అంతేకాదు, చెట్ల‌ను ప‌రిర‌క్షించండి, ప‌ర్యావ‌రణాన్ని కాపాడండి.. అనే ఓ సందేశాన్ని కూడా బెంగాలీలో త‌న ఆటోపై రాశాడు.ఏది ఏమైనా బిజయ్ పాల్ చేసిన వినూత్న ఆలోచ‌న‌కు, అందిస్తున్న సేవ‌ల‌కు అత‌న్ని నిజంగా అంద‌రం అభినందించాల్సిందే పర్యావరణ పరిరక్షకులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: