ఏపీ ఎన్నికల్లో జనసేన ఎవరి ఓట్లు చీల్చింది.. ఇది ఓ మిలియన్ డాలర్ ప్రశ్న. జనసేన తాను అధికారంలోకి రాకపోయినా.. ఎవరో ఒక పార్టీని బాగా దెబ్బ తీస్తుందని మొదటి నుంచి అనుకుంటూ వస్తున్నదే. కానీ జనసేన ఎవరి ఓట్లు చీల్చిందన్నది అర్థం కావడం లేదు. 


ఐతే.. జనసేన వల్ల టీడీపీ కన్నా వైసీపీకే ఎక్కువ నష్టం అంటున్నారు ఓ సీనియర్ పొలిటీషన్. బీఎస్పీతో జనసేన జత కట్టడం వల్ల ఎస్సీ ఓట్లలో చీలిక వచ్చిందని, ఇది వైసీపీకి నష్టమని సీనియర్ రాజకీయ నాయకుడు హరిరామజోగయ్య అభిప్రాయపడ్డారు. వైసీపీ గత ఎన్నికలకన్నా ఇప్పుడు ఏ వర్గాన్నీ కొత్తగా ఆకర్షించలేక పోయిందని ఆయన విశ్లేషించారు.

జనసేనతో టీడీపీకి కూడా నష్టం ఉంటుందని జోగయ్య అంచనా వేస్తున్నారు. పసుపు -కుంకుమ స్కీమ్ ద్వారా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా లాభం పొందుతున్నానని అనుకుంటోందని... కానీ ఆ లాభం కన్నా,జనసేన పోటీ వల్ల టిడిపికి జరిగిన నష్టమే ఎక్కువ అని హరిరామజోగయ్య అన్నారు.

మరి ఇంతకీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారని అడిగితే... ఏ పార్టీకీ 90 స్థానాలు మించి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆయన అంటున్నారు. ఎవరు గెలుస్తారో చెప్పే పరిస్థితి లేదని చెబుతున్నారు. అందుకే పార్టీల గెలుపు, ఓటములపై పందేలు కాసి నష్టపోవద్దని ప్రజలకు సూచించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: