ఔను.. ఏపీలో దమ్మున్న లీడర్ ఎవరో ఈవీఎం మెషీన్ చెప్పేసింది. ఎలాగంటారా.. మనం ఓటు వేశాక.. మన ఓటు ఎవరికి పడిందో చెప్పేలా ఓ స్లిప్ కనిపిస్తుంది.. అది కొద్దిసేపు కనిపించాక కిందపడిపోతుంది.. దీన్నే వీవీ ప్యాట్ అంటారు. అయితే ఈ సౌకర్యం ఉన్నాక కూడా ఏపీ సీఎం చంద్రబాబు తన ఓటు తనకే పడిందో లేదో అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


మరి చంద్రబాబు కు ఆయన ఓటు ఎవరికి పడిందో తెలుసుకోలేకపోయారా?ఈవిఎమ్ నొక్కిన తర్వాత వివిపాట్ లో వచ్చిన బొమ్మను చూసుకోలేకపోయారా?లేక చూసుకోవడం లో ఇబ్బంది పడ్డారా అన్నది అర్థం కావడం లేదు. ఆయన పదే పదే తన ఓటు ఎవరికి పడిందో అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన ఓటు ఎవరికి వెళ్లిందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని మీడియాతోనే అన్నారు. 

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. వైఎస్ జగన్... తాను ఫ్యాన్ గుర్తుకు నొక్కితే వీవీప్యాట్‌లో తన ఓటు స్పష్టంగా కనిపించిందని తెలిపారు. అదే తన ఓటు సైకిల్‌కు పడుంటే ఊరుకునే వాడిని కాదని ఆయన వ్యాఖ్యానించారు. జగనే కాదు.. ఎవరైనా అంతే కదా.. తన ఓటు వేరే వాళ్లకు పడితే ఊరుకుంటారా.. ? 

మరి చంద్రబాబు ఎలా ఊరుకున్నారు.. అక్కడే గొడవ చేయొచ్చుగా.. మరి సీఎంకే ఓటు సరిగ్గా వేయడం రాకపోతే..ఇక ఈవీఎంపై జాతీయ స్థాయిలో ఎలా పోరాడతారు. ఇదంతా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకా.. లేక ఓటమికి ముందస్తు సాకులు వెదుక్కుంటున్నారా అనే అనుమానాలు వస్తే అది ప్రజల తప్పు కాదు కదా.? 



మరింత సమాచారం తెలుసుకోండి: