ఏపీలో ఎన్నికలు జరిగి వారం కావస్తోంది. ఈ వారంలో జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ఓ వైపు పోలింగ్ అర్ధరాత్రి మూడు వరకూ సాగింది. ఇంకోవైపు ఎన్నడూ లేని విధంగా పోలింగు రోజున  బలిదానం కూడా జరిగింది.   గొడవల్లో టీడీపీ, వైసీపీ ముఖ్య కార్యకర్తలు చనిపోయారు. ఈవీఎంలు మొరాయించాయి. మొత్తం ముప్పయి శాతం పైగా పనిచేయడంలేదని ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబే ఆరోపించారు.


అంతేనా రీపోలింగ్ కు కూడా ఆయన డిమాండ్ చేశారు. పోలింగ్ మొదలైన  రెండు గంటలకు మళ్ళీ పోలింగ్ కావాలని కోరడం బహుశా దేశ చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదేమో. అదీ ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ గా చెప్పుకునే బాబు నోటి వెంట ఈ మాటలు రావడమూ విడ్డూరమే. ఇక అంతటితో ఆగని బాబు డిల్లీలోనూ ఇదే స్వరం వింపించారు. ఇక కర్నాటక, తమిళనాడు ఎన్నికల్లోనూ కూడా బాబు ప్రచారం ఇదే తీరుగా సాగింది.


ఇవన్నీ చూసిన ప్రజలకు ఒకే అనుమానం కలిగింది. అదేంటంటే బాబుకు గెలుపు మీద ధీమా తగ్గిందా అని. దీనిమీద ఓ వెబ్ పోర్టల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో 98.2 శాతం వచ్చింది మంది బాబుది ఓటమి భయమేనని తేల్చేశారు. మరి బాబు మాటలు, చేష్టలు చూసిన తరువాత తమ్ముళ్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. అంతేగా మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: