ఒక ఆట ఆడేటప్పుడే ఇద్దరు ఆటగాళ్ళు నిబంధనలు గౌరవించాలి. విశ్వాసం ఉంచాలి. అలా కాకుండా ఆటలో ఓడిపోతామనో, లేక అనుకున్నట్లుగా సాగడంలేదనో  మధ్యలో  భావించి ఆట తీరునే తప్పు పడితే ఎలా ఉంటుంది. ఏపీలో ఇపుడు అదే జరుగుతోంది. ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లుగా ఈవీఎంల మీద నిందలు పడుతున్నాయి.


ఈ నిందలు తొలగిపోవాలంటే ఒక్కటి జరగాలంట. రేపటి ఫలితాల్లో  టీడీపీ ఘనమైన విజయం నమోదు చేసుకోవాలంట. ఏపీలో జనం టీడీపీకే పట్టం కట్టారని, అయితే ఆ పార్టీ కనుక ఓడిపోతే మాత్రం ఈవీఎంలదే తప్పు అంటున్నారు  టీడీపీ నేత వేమూరి హరిప్రసాద్. ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ గెలుపు పక్కా. ఇందులో డౌటే లేదు. కానీ ఓడితే మాత్రం ఈవీఎంలదే అంటూ వింత వాదన ముందుకు తేవడం విశేషం.


ఏపీలో వైసీపీ గెలిస్తే మాత్రం అది ఈవీఎంల పనేనని తాము గట్టిగా చెబుతామని కూడా అయన అంటున్నాన్నారు.   టీడీపీ గెలిస్తే ఈవీఎంలు మేనేజ్ కాలేదని, వైసీపీ గెలిస్తే మాత్రం ఈవీఎంలను మేనేజ్ చేసినట్లు భావించాల్సి ఉంటుందని  ఆయాన చెప్పడం దారుణమే. మరి ఈ రకమైన వాదనేగా ఆ పార్టీ అధినేత ఇంతవరకూ  చెబుతున్నది. దాన్నే లోకమంతంటా ప్రచారంలో పెడుతున్నది కూడా ఇందుకోసమేనా అన్న అనుమానాలకు జవాబు హరిప్రసాద్ ఇచ్చేశారు.


ఈవీఎంల ద్వారా టాంపరింగ్  చేయవచ్చునని, దాని మీదనే తమ పోరాటమని ఆయన అంటున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ మధ్యలో జనం తీర్పుని కూడా గుర్తు ఉంచుకుంటే బాగుంటుందని అంటున్నారు. ఈవీఎంలకు శీల పరీక్ష పెట్టే ప్రయత్నంలో ఓటేసిన కోట్లాది మంది జనాన్ని కూడా తప్పు పడుతున్నామన్న ఆలోచన టీడీపీ నేతలకు కొరవడించని కూడా అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే వైసీపీ గెలుపునకు ఈవీఎంల పనితీరును ముపెడుతూ టీడీపీ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్ చేసిన కామెంట్లు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి ఇదే మాట 2014 ఎన్నికల్లొ ఎందుకు అనలేదో వారే జవాబు చెప్పాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: