జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన పార్టీ పెట్టిన అయిదేళ్లకు ఎన్నికల గోదాలోకి దిగారు. పవన్ భీమవరం, గాజువాకలో పోటీ చేస్తున్న సంగతి విధితమే. పవన్ రెండు చోట్లా గెలుస్తారని ఓ వైపు ఆయన అభిమానులు గట్టిగా బల్ల గుద్ది మరీ చెబుతూంటే పోలింగ్ సరళి తరువాత పవన్ ఒక చోట గెలుస్తారని విశ్లేషణలు ఉన్నాయి. అయితే పవన్ ఓడే సీటు ఏంటి గెలిచే సీటు ఏంటి అన్నది చర్చగా ఉంది.


పవన్ గాజువాక్లో ఓడిపోతారని వైసీపీ మద్దతుదారు, థర్టీ  యియర్స్ ఇండస్ట్రీ ప్రుధ్వీ బాంబు పేల్చారు. తాను గాజువాకలో ప్రచారం చేశానని అక్కడ లోకల్ అభ్యర్ధిగా ఉంటూ చాలా కాలంగా పోరాటాలు చేసిన వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి గెలుస్తారని ప్రుద్వీ ఘంటాపధంగా చెబుతున్నారు. పవన్ నాన్ లోకల్ అన్నది పెద్ద  ప్రభావం చూపిస్తోందని కూడా ప్రుద్వి చెప్పుకొచారు. ఈ ఎన్నికల్లో పవన్ పోటీచేసిన గాజువాక అసెంబ్లీలో  అక్కడ రెండు సార్లు గతంలో పోటీచేసిన నాగిరెడ్డిపై ఈసారి ప్రజల సానుభూతి బాగా పనిచేసిందని అన్నారు.


ఇక  విద్యార్థులు ఫ్రొఫెసర్లు ఆయనకే మద్దతునిచ్చారని.. ఇదే నాగిరెడ్డి గెలుపునకు ఇదే దోహదపడుతోందని ఫృథ్వీ వివరించారు. అందుకే గాజువాకలో పవన్ ఈసారి ఖచ్చితంగా ఓడిపోతాడని పోలింగ్ సరళి చెబుతోందని ఫృథ్వీ చెప్పడం విశేషం. ఈ ప్రాంతంలోని ప్రజలు స్థానికంగా ఉండే నిజమైన లోకల్ లీడర్లకే పట్టం కట్టారని ఆయన అంటున్నారు. 
అలాగే,  ఏపీలో వచ్చేది వైసీపీ సర్కారేనని కూడా ప్రుధ్వి చెప్పేశారు. 2014 ఎన్నికల్లోనే రావాల్సిన తమ పార్టీ కొన్ని లోపాల వల్ల ఓడిపోయిందని అన్నారు. ఈసారి అన్నీ కవర్ చేసుకుని ముందుకు వెళ్ళామని, ఆరు నూరైనా ఈసారి జగన్ విజయం  ఖాయమని, ఆయనే రేపటి సీఎం అని కూడా ప్రుధ్వి జోస్యం చెప్పేశారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: