చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు  ఉన్నతాధికారులు తట్టాబుట్టా సర్దేసుకుంటున్నారు. మొన్న జరిగిన పోలింగ్ తర్వాత వీళ్లంతా రాబోయేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అనే నిర్ధారణకు వచ్చేసినట్లున్నారు. నిజంగానే జగన్ గనుక సిఎం అయితే తమ పరిస్ధితేంటో మిగితా  వాళ్ళకన్న వాళ్ళకే  బాగా తెలుసు.  కౌంటింగ్ అయి ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకూ వెయిట్ చేసేకన్నా ముందే జాగ్రత్తపడితే మంచిదన్న ఉద్దేశ్యంతో కేంద్రంలోని డివోపిటికి దరఖాస్తు చేసుకున్నారు.

 

డివోపిటికి దరఖాస్తు చేసుకున్నవారిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్, గిరిజాశంకర్ తో పాటు మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఉన్నారట. సరే వీళ్ళ సంగతిని పక్కనపెడితే చంద్రబాబుకు లా అండ్ ఆర్డర్ లో అన్నీ తానై వ్యవహరించిన డిజిపి ఆర్పీ ఠాకూర్ కూడా డివోపిటికి దరఖాస్తు చేసుకున్నారట. ఆ విషయం తెలిసి టిడిపికి వత్తాసు పలికిన అధికారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఠాకూర్ అంటేనే వైసిపి నేతలు మండిపోతున్నారు. అంటే అంత స్ధాయిలో చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

 

గతంలో ఏ డిజిపి కూడా ఎదుర్కోనన్ని ఆరోపణలను ఠాకూర్ ఎదుర్కొంటున్నారు.  విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం ఘటన కావచ్చు అంతకుముందు అనేక సందర్భాల్లో కావచ్చు. టిడిపి నేతలు ఫిర్యాదు చేయటం ఆలస్యం వెంటనే వైసిపి నేతలపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు పంపించేయటం. తాడిపత్రిలో వైసిపి నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై నమోదు చేసిన కేసులు పంపిన రిమాండ్లే ఉదాహరణలు.

 

నిజానికి అంతపెద్ద చదువులు చదివి అఖిల భారత సర్వీసులకు సెలక్ట్ అయి ఐఏఎస్, ఐపిఎస్ అధికారులయ్యింది అధికారంలో ఉన్న వారి అడుగులకు వత్తాసు పలకటానికి కాదన్న నిజాన్ని కూడా మరచిపోయారు.  అందుకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి ఠాకూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు చంద్రబాబు జేబులో మనుషులుగా మారిపోయారంటూ వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.  వారి వ్యవహార శైలి కూడా దానికి తగ్గట్లే ఉంటోంది. అందుకే ఇపుడు వైసిపి అధికారంలోకి వస్తోందనే ప్రచారంతో భయపడిపోతున్నారు. అందుకే ఢిల్లీ సర్వీసులకు దరఖాస్తులు చేసుకుంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: