తెలంగాణ పోలీసులు విచారణ చేస్తున్న డేటా చోరీ కేసు వ్యవహారం ఏపీలో ఎవరి మెడకు చుట్టుకుంటుంది. ఇప్పుడు ఇదో ఇంట్రస్టింగ్ టాపిక్. ఓవైపు తెలంగాణ సిట్ తమ విచారణలో భాగంగా ఏపీలో కూడా అడుగుపెట్టిందని.. ఏపీ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజల డాటా కూడా సేవామిత్ర యాప్ లో ఉందని వారి విచారణలో తేలిందట. 


దాదాపు 7 కోట్ల మంది డేటా సేవామిత్ర యాప్ లో ఉన్నట్టు ఫోరెన్సిక్ నిపుణులు తేల్చినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు ఆధార్ సంస్థ కూడా తమ డేటా దుర్వినియోగంపై సీరియస్ గా ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జోరుగా సాగుతోంది. 

మరి ఈ సమయంలో ఈ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.  సేవా మిత్ర యాప్ లో ప్రభుత్వం దగ్గరున్న డాటా రావడంలో ముగ్గురు వ్యక్తులు కీలక పాత్ర పోషించినట్టు అనుమానిస్తున్నారు. ఐటీ మంత్రిగా నారా లోకేశ్‌.. సేవామిత్ర యాప్ రూపొందించిన సంస్థ యజమాని అశోక్‌, ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించిన ఐటీ సలహాదారు హరిప్రసాద్‌ ఇందులో కీలక పాత్రలుగా గుర్తించినట్టు తెలుస్తుంది. 


మరి ఫైనల్‌ గా ఈ కేసులో ఎవరి బలికాబోతున్నారు. ఎవరిని బలిపశువును చేయబోతున్నారన్నది తేలాల్సిఉంది. ఎన్నికల్లో తెలుగుదేశం గెలిస్తే.. ఏదో ఒక రకంగా ఈ కేసు నుంచి బయటపడే అవకాశం ఉన్నా.. ఓడిపోతే మాత్రం పీకల్లోతు కష్టాలు తప్పవనే వాదన వినిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: