కేసీఆర్ - జగన్- మోదీ కుమ్మక్కయ్యారు..ఏపీపై కుట్రలు చేస్తున్నారు.. ఆంధ్రా ద్రోహులతో జగన్ చేతులు కలుపుతున్నారు.. ఏపీలో బలహీనమైన సీఎం ఉంటేనే తన ఆటలు సాగుతాయని కేసీఆర్ జగన్‌తో చేతులు కలిపాడు.. ఇవీ ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ఎన్నికల ప్రచార సభల్లో చేసిన ఆరోపణలు..


ఇప్పుడు అసలు కేసీఆర్  జగన్ దోస్తీ వెనుక అసలు కారణం చూద్దాం.. తెలంగాణలో తెలుగుదేశం బలమైన మూలాలు ఉన్న పార్టీ.. దాన్ని పూర్తిగా తెలంగాణలో లేకుండా చేయాలన్న లక్ష్యం సాధించేందుకు కేసీఆర్ జగన్‌తో దోస్తీకి సై అన్నారు. ఆ లక్ష్యాన్ని దాదాపు సాధించేశారు. మొన్న తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో టీడీపీ కనీసం పోటీ చేయకపోవడమే ఇందుకు సాక్ష్యం. 

మరో విషయం.. తెలంగాణలో బలమైన సామాజిక వర్గమైన రెడ్డిల మద్దతు కోసం జగన్ తో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారు. తెలంగాణలో ఎలాగూ అధికారానికి రెడ్లు దూరమయ్యారు. కనీసం ఏపీలోనైనా రెడ్డిని సీఎం చేసేందుకు సహకరిస్తే ఇక్కడ తెలంగాణలోనూ రెడ్లు కేసీఆర్ కు మద్దతు ఇచ్చే చాన్స్ ఉంది. 

ఇక మూడోది.. కేసీఆర్ ఎంతగా తెలంగాణలో 17కు 16 ఎంపీ సీట్లు గెలుచుకున్నా కేంద్రంలో పెద్దగా పట్టించుకోరు. అదే జగన్ కు ఓ పది నుంచి పదిహేను వస్తే.. మొత్తం కలిపి ఓ 35-40 ఎంపీల సంఖ్యాబలం ఉంటే కేంద్రంలో తమ  మాట చెల్లుబాటు అవుతుందనేది కేసీఆర్- జగన్ ఉమ్మడి వ్యూహం. మరి దీన్ని రాజకీయ ఎత్తుగడ అంటారా.. కుమ్మక్కు రాజకీయం అంటారా అనేది జనమే నిర్ణయించుకోవాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: