టీడీపీ ప్రభుత్వం ఈ ఐదేళ్లల్లో ప్రజలను ఎంతగా మభ్యపెట్టిందో, తన అనుకుల మీడియా ద్వారా ఎంతలా ప్రజలను మభ్యపెట్టిందో ఇప్పుడు తేటతెల్లం అయిపొయింది. పట్టిసీమ ద్వారా నీళ్లు ఇచ్చేశామని రాయలసీమ రతనాల సీమ అయిపోయిందని మీడియా ద్వారా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రతి పక్ష నేత అయినా జగన్ ఎప్పుడో చెప్పారు. పట్టిసీమ ద్వారా నీళ్లు ఇవ్వటం అనేది ఒక బ్రమ అని . 


అయితే ఇప్పుడు ఏకంగా టీడీపీ ప్రభుత్వం, అనుకూల మీడియానే రాష్ట్రంలో కరువు గురించి నమ్మలేని నిజాలు చెప్పారు. టీడీపీ మీడియా చెబుతూ రాష్ట్రంలో కరువు పెరిగిందని రాయలసీమలో అయితే మరి అని భూగర్బజలాలు మరింత ఇంకి పోయాయని ఆ పత్రికల్లో రాసుకొచ్చారు. కానీ ఎన్నికల ముందు టీడీపీ ప్రకటనలు చూస్తే మతి పోక తప్పదు. పట్టిసీమ ద్వారా నీళ్లు ఇచ్చేశామని రాయలసీమ రతనాల సీమ అని భయకంరమైన యాడ్ లు చిత్రీకరికంచారు. 


నిజంగా పట్టిసీమ ద్వారా రాయలసీమలో కరువనేది లేకపోతే కేంద్రం నుంచి కరువు నిధులు ఎందుకు తీసుకున్నారని ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టీడీపీ అనుకూల మీడియా ఎన్నికలు అయిపోయిన తరువాత ఇప్పుడు కరువు గురించి నిజాలు చెప్పడం, ఇటువంటి మీడియా మనకు ఉన్నందుకు మన దురదృష్టం. అయితే ఎంతగా మభ్య పెట్టిన కరువు గురించి అసలు నిజాలు రాయలసీమ రైతులకు తెలియకుండా ఉంటుందా ..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: