హైదరాబాద్ కు చెందిన ఒక కంపెనీ లో ఆంధ్ర ప్రదేశ్ డేటా వెలుగు చూడటం తో రాజకీయంగా దుమారం రేపింది. ఏపిలో డేటా చోరీ జ‌రిగిందంటూ వ‌చ్చిన ఫిర్యాదుల పై విచార‌ణ చేస్తున్న సైబ‌రాబాద్ పోలీసులు కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర అంశాలతో పాటు సంచలన విషయాలు కూడా వెలుగు చుసిన సంగతి  తెలిసిందే.  ఏకంగా ఐటీ గ్రిడ్ వద్ద ఉన్న ఏపీ ప్రజల సమాచారంలో సాక్షి దినపత్రిక చందాదారుల వివరాలు కూడా ఉన్నాయన్న సంగతి తెలిసిందే.


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కటుంబం ఆధ్వర్యంలో సాక్షి పత్రికతో పాటు సాక్షి న్యూస్ ఛానెల్ నడుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ఫ్యామిలీకి చెందిన ఈ పత్రిక రీడర్లలో మెజారిటీ ప్రజలు వైసీపీ సానుభూతిపరులు ఆ పార్టీ నేతలు కార్యకర్తలే ఉంటారు కదా. మరి ఈ వివరాలన్నీ కూడా సేకరించేసిన ఏపీ ప్రభుత్వం... ఆ వివరాలను ఐటి గ్రిడ్కు అందించడం చూస్తుంటే... ఈ వ్యవహారం భారీ స్థాయిలోనే సాగుతోందని చెప్పక తప్పదు. 


అయితే ఇప్పుడు మరో ఒక విషయం అర్ధం చేసుకోవాలి. ఆధార్ డేటాతో లింక్ అయినా సమాచారం అంత 2104 నుంచి సేకరిస్తున్నారు. దానితో పాటు ఓటర్ల జాబితాను కూడా లింక్ చేశారు సేవామిత్ర యాప్ ద్వారా. అయితే 2106 లో సుప్రీమ్ కోర్ట్ ఆధార్ డేటా ను తీసుకోవద్దని చెప్పింది. మరి 2014 లో సేకరించిన డేటాకు ఈ తీర్పు అమలు కాదని మాటలు వినిపిస్తున్నాయి. అయితే నిజంగా ఆ యాప్ ద్వారా ఓటర్ల జాబితాను తొలిగిస్తే మాత్రం అది పెద్ద క్రిమినల్ కేసుగా పరిగణిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: