ఏపీకి మొదటి విడత  ఎన్నికలు ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఈ రోజుకు ఇంకా 35 రోజులకు గానీ ఫలితాలు వచ్చే పరిస్థితి లేదు. ఇక సరిగ్గా వారం క్రితం ఏపీలో పోలింగ్ అయింది. ఈ వారం రోజులు నానా యాగీని చేస్తున్న రాజకీయాన్ని అంతా చూస్తూనే ఉన్నారు. అంతకు ముందు అయితే ఎన్నికల ప్రచారం అని సరిపెట్టుకోవచ్చు. కానీ, ఇపుడు ఈ  పోస్ట్ పోల్ గొడవలు, రాజకీయలేంటన్నదే ఎవరికీ అర్ధం కాని విషయం.



ఇదిలా ఉండగా చంద్రబాబు తాను ఆపధ్ధర్మ సీఎం అని ఎక్కడా ఫీల్ కావడం లేదు. ఆయన ఎంచక్కా తన విధులకు హాజరవుతున్నారు. పాలనా వ్యవహారాలు చూస్తున్నారు. నిన్న పోలవరం ప్రాజెక్ట్ పై  సమీక్ష నిర్వహించారు. జూలై నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు ఇవ్వాలని బాబు అధికారులను ఆదేశించారు. డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని కూడా బాబు కోరారు. ఇక తాను పాలనను పరుగులు పెట్టిస్తానని, నెల రోజుల సమయం వ్రుధా చేస్తుకోనని బాబు మీడియా ఎదుట చెప్పేశారు.



ఇక తాను మళ్ళీ సీఎం అవుతానని, ఇందులో డౌట్ ఏముందని కూడా బాబు విలేకరులను ప్రశ్నించారు. వైసీపీ నేతలది ఆయాసం తప్ప మరోటి కాదని కూడా బాబు చెప్పేశారు. అసలు ఫలితాల  వరకూ ఆగనవసరం లేదని, జనం ఎపుడో తీర్పు చెప్పేశారని కూడా బాబు అనడం విశేషం. అంటే టీడీపీకి అనుకూలంగానే రేపటి ఫలితాలు ఉంటాయని బాబు భావిస్తున్నారా. అలా అయితే మళ్ళీ ఈవీఎంల మీద ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల పాటు ఢిల్లీ వరకూ చేసిన యాగీ సంగతేంటి. 
ఈ విషయం ఇంతటితో వదలను అని, దేశంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకుని ఈవీఎంల బండారం బయటపెడతానని మరో వైపు అంటున్నారు. అంటే గెలుస్తానని చెబుతున్న బాబు ఇలా అనడమేంటో ఎవరికీ అర్ధం కావడంలేదు. మొత్తానికి బాబు మాటలు, చేష్టలు ఎలా ఉన్నా ఏపీకి  మళ్ళీ నేనే సీఎం అన్నది ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారన్నది అర్ధమైపోతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: