భారత సైన్యానికి ప్రధాని మోదీ.. అత్యావరస అధికారాలు ఇచ్చారని వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరగుతున్నాయి. భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ఓ సుదీర్ఘ ప్రక్రియ. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న కాలం కోడ్ అమలులో ఉంటుంది. 


ఈ కోడ్ సమయంలో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ నిబంధన ఉద్దేశం మంచిదే అయినా అది ఒక్కోసారి కాళ్లకు బంధాలు వేస్తుంటుంది. ఇప్పుడు సైన్యం విషయంలోనూ అదే జరగుతోంది. సైన్యానికి సంబంధించిన అత్యవసర కొనుగోళ్లకు ఈ కోడ్ అడ్డంకిగా మారుతోంది. 

అందుకే మోడీ సర్కారు ఓ సాహసోపేత నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. దీని ప్రకారం ఎన్నికల కోడ్ ఉన్నా సరే.. సైన్యం తనకు కావాలసిన సామగ్రిని కొనుక్కోవచ్చు. అందుకు అన్ని అధికారాలు ఇస్తూ మోడీ ఆదేశాలిచ్చారని తెలుస్తోంది. 

ఒక్కోసారి ఈ కోడ్ వల్ల సైన్యానికి సంబంధించిన కొనుగోళ్లు ఆగుతాయి. ఎన్నికల తర్వాత కొనే సమయానికి వాటి ధరలు బాగా పెరుగుతుంటాయి. అందుకే.. సైన్యానికి అత్యవసర కొనుగోళ్లపై అధికారం ఇస్తూ మోడీ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: