పవన్ కళ్యాన్ ఈ పేరు వింటే ఇప్పుడు ఏపిలో ఓ ట్రెండ్ కొనసాగుతుంది. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించిన పవన్ కళ్యాన్ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’పార్టీ స్థాపించారు.  స్వతహాగా సమాజ సేవ చేయాలనే ఆలోచనదోరణిలో ఉండే పవన్ కళ్యాన్ రాజకీయ నాయకులను, అధికారులను ప్రశ్నించాలంటే..ఒక సామాన్యుడిగా కన్నా రాజకీయ నాయకుడిగా అయితే మరింత బలం ఉంటుందనే ఉద్దేశ్యంతో ‘జనసేన’పార్టీ స్థాపించారు.


అప్పటి నుంచి రాజధాని భూములు, రైతులు, మహిళలు, విద్యార్థుల తరుపు నుంచి ఎన్నో సమస్యల పోరాటం చేశారు..ప్రభుత్వాన్ని నిలదీశారు.  ఇదే సమయంలో ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం చెప్పిన తర్వాత ఆయన ఉద్యమం మరింత తీవ్రం చేశారు.  ఇలా ప్రజల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాన్ ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తన అభ్యర్థులను నిలిపారు.  


పవన్ పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో ఆయనే అన్ని బాధ్యతలు నెత్తిన వేసుకొని ప్రచారాలు చేశారు.  ఎండవేడిమిని లేక్క చేయకుండా వరుసగా నియోజకవర్గాల్లో తిరిగి తిరిగి పవన్ అలసిపోయినా..డీ హైడ్రేషన్ కి లోనైనా సెలెన్ ఎక్కించుకొని మరీ ప్రచారం చేశారు. ఒక నాయకుడు తమ కోసం ఇంతకన్నా ఎక్కువ ఏం చేస్తాడు అన్ని అభిప్రాయానికి కొంత మంది వచ్చారు..అందుకే పవన్ కి జై అన్నారు.


ఇక ఏపిలో అధికార పార్టీ డీటీపీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీ హోరా హోరీ యుద్దం చేస్తున్న సమయంలో జనసేన పార్టీ కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే విధంగా ప్రచారం చేసింది. అయితే సర్వేలు పలు రకాలుగా వస్తున్నా..పోటీ టీడీపీ వర్సెస్ వైసీపీకి ఉంటుందన్నా..జనసేన కూడా గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు.  ఇదే జరిగితే..అనూహ్యంగా పవన్ సీఎం పీఠం ఎక్కినా ఆశ్చర్యపడనవసరం లేదని అంటున్నారు.  మరి మే 23న వచ్చే ఫలితాలు జనసేన ఎలాంటి మాయ చేస్తుందో..పవన్ రాజకీయ నాయకులను ఎలా  భయపెట్టబోతున్నారో తెలిసిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: