దేశంలో రెండవ విడత పోలింగ్ ఈ రోజు ప్రారంభమైంది. పక్కనున్న తమిళనాడులో మొత్తం 38 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలైన అన్నా డీఎంకే, డీఎంకే, కమల్ హాసన్ పార్టీ కూడా పోటీ పడ్డాయి. ఇక ఎన్నికల్లో ఓటు వేయడానికి సినీ తారలు, సెలిబ్రిటీలు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం జరిగింది.


కమల్ హాసన్ అతి సామాన్యుడిగా ఓటు వేయడానికి క్యూలో నిలుచుని ఉన్న సీన్లు ఇపుడు వైరల్ అవుతుననాయి. ఆయన తన కుమార్తె శ్రుతి హాసన్ తో కలసి పోలింగ్ స్టేషన్ కి వచ్చి సాధారణ ఓటరుగా క్యూలో నిలబడి అందరికీ స్పూర్తిని కలిగించారు. ఇది నిజంగా  మిగిలిన వారు అనుసరించాల్సిన విషయం. గత వారం ఏపీలో ఎన్నికలు జరిగినపుడు చాలా మంది సెలిబ్రిటీలు, అధికారం ఉన్న వారు సాదా సీదా జనాన్ని తోసుకుని వెళ్లారని వార్తలు వచ్చాయి.


మరి టాప్ స్టార్ గా ఉండి, ఓ పార్టీ అధినేతగా ఉన్న కమల్ ఓటు వేయడానికి ఈ విధంగా క్యూలో రావడం గొప్ప విషయమే. ఇక మరో సూపర్ స్టార్ రజనీకాంత్ ఓటు వేశారు.  చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూపర్‌ స్టార్‌ పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకోగానే ఆయన్ని చూడడానికి అభిమానులంతా ఎగబడ్డారు. అలాగే, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి క్యూలైన్‌లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇది కూడా మిగిలిన సీఎం లు అంతా అనుసరించాల్సిన  విషయమే.  అదే విధంగా  ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రహమాన్‌, నటుడు విజయ్‌ ఆంటోని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  మొత్తానికి ఈ దేశంలో అందరూ సమానమే. ఓటరే గొప్ప అన్న విషయాన్ని తమిళనాడు పోలింగ్ సందర్భంగా చాలా మంది పెద్దలు ఆచరించి చూపడం అభినందనీయం.


మరింత సమాచారం తెలుసుకోండి: