గతములో ఆంధ్ర ప్రదేశ్ విభాగం సీబీఐ జేడీగా వ్యవహరించిన సమయంలో ఒక వర్గం మీడియా ప్రచారం ద్వారా చాలా గుర్తింపు పొందిన వి వి లక్ష్మినారాయణ, అదే గుర్తింపుతో ప్రజల్లో పెల్లుభికిన ఆదరణ తో ఆయన అర్దాంతరంగా ఉద్యోగాన్ని సైతం వదులుకుని వచ్చి ఎన్నికల్లో పోటీ చేశారనే విషయం తెలిసిందే. సీబీఐ విచారణ అధికారిగా లభించిన గుర్తింపు ఆయన్ను రాజకీయ అరంగేట్రానికి ప్రోత్సాహమిచ్చింది. 
Image result for bjp raghuram
రాజకీయాల్లోకి రావడానికి లక్ష్మినారాయణ ఉద్యోగాన్ని వదలుకుని కొన్ని రోజుల పాటు రాష్ట్ర రాజకీయ వ్యవహారాలను ప్రజాభిప్రాయాన్ని పరిశీలించారు. అయితే తెలుగు దేశం పార్టీ లోకి చేరబోతున్నారనే వార్తలు విశేషంగా వినిపించటమే కాదు, టీడీపీలో చేరి ఆయన భీమిలి శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తారనే మాట ప్రతిద్వనించింది. అయితే ఆ సమాచారం వచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన తెలుగుదేశంలోకి చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఆ తరవాత లోక్ సత్త లోకి చేరిన వార్తలు వచ్చాయి. అదీ కూడా నిజంకాదని తెలిసింది. 
Image result for cbi ex jd vv lakshminarayana has beaten srilakshmi ias
మొత్తం మీద జనసేన లోకి చేరి లోక్ సభ టికెట్ పొంది విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు లక్ష్మినారాయణ. మరి ఆయన గెలుస్తారా? ఓడతారా? అనేది విశ్లేషణ ఇప్పుడు అనవసరం ఎందుకంటే ఒక నెల పది రోజుల్లో ఫలితాలు వస్తే కాని అసలు విజయం విషయం తెలియదు.  అయితే ఒక టీవీ చర్చా కార్యక్రమంలో లక్ష్మినారాయణ గురించి బీజేపీ నేత రఘురాం ఒక ఆసక్తిదాయకమైన వ్యాఖ్యను చేశారు. గతంలో సీబీఐ  జేడీగా ఉన్నప్పుడు, ఏపీకి సంబంధించి కీలకమైన కేసులను విచారించిన లక్ష్మినారాయణ, విచారణ సమయంలో ఒక ఐఏఎస్ అధికారిపై చేయి చేసుకున్నారని రఘురాం ప్రకటించారు. 
BJP Raghuram vs JD Lakshminarayana కోసం చిత్ర ఫలితం
అలా వి వి లక్ష్మినారాయణ చేత భౌతిక దాడిని ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి  అని ఆయన చెప్పు కొచ్చారు. అప్పట్లో వి వి లక్ష్మినారాయణ వివిధ కేసుల్లో చాలా మంది ఐఏఎస్ ల మీద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ తరవాత కొందరి కేసులు కోర్టుల్లో కొట్టివేయబడగా వారు విధుల్లో చేరిపోయారు. విచారణలో భాగంగా ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మిని లక్ష్మినారాయణ కొట్టారని రఘురాం చెప్పారు.


విచారణలో భాగంగానే అయినప్పటికీ ఒక సాటి ఐఏఎస్, అదీ ఒక మహిళా అధికారిణి మీద లక్ష్మినారాయణ చేయిచేసుకుని ఉంటారా? అనేది మాత్రం అనుమానాస్పదం ఎప్పటికైనా అది బయటి వాళ్లకు తెలిసే అంశం కాదు. బీజేపీ నేత మాత్రం కొన్ని వర్గాల ద్వారా ఆ సమాచారం తెలిసిందని అన్నారు. ఈ విషయంపై స్పందించమని అనకాపల్లిలో ఉన్న వివి లక్ష్మినారాయణ నేడు అని అడిగినప్పుడు అధారాలు లేని ఆరోపనలపై స్పందించనని అన్నారు. రఘురాం దగ్గర ఆధారాలు ఉంటే చూపాలని అన్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: