విచత్రంగా ఉంది చంద్రబాబునాయుడు పరిస్ధితి చూస్తుంటే. లక్ష కోట్ల రూపాయలు దోచేశాడని, 31 కేసుల్లో నిందితుడని జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు తిట్టని రోజులేదు. ఎన్నికల ప్రచారం మొత్తం జగన్ ను నిందుతుడని, కోట్ల రూపాయలు దోచేశాడనే చెప్పారు. అంత చేసిన చంద్రబాబు చివరకు జగన్ సహనిందితుడితోనే సమీక్షలు నిర్వహించాల్సొస్తోంది.

 

ఇక్కడ జగన్ సహనిందితుడంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం. అక్రమార్జన కేసుల్లో జగన్ తో పాటు ఎల్వీ సుబ్రమణ్యంపైన కూడా సిబిఐ కేసు నమోదు చేసింది. అయితే విచారణ సందర్భంగా సరైన ఆధారాలు లేవన్న కారణంతో సుబ్రమణ్యంపై పెట్టిన కేసులను ఎత్తేసింది.

 

సిబిఐ పెట్టిన కేసును కోర్టు  కొట్టేసిన తర్వాత సుబ్రమణ్యంను నిందితుడు అనటానికి వీల్లేదు.  కానీ తనకిష్టం లేకుండా ఎన్నికల కమీషన్ ద్వారా నియామకమైన ప్రధాన కార్యదర్శి కూడా సుబ్రమణ్యంను జగన్ సహ నిందితుడంటూ చంద్రబాబు తన అక్కసునంతా తీర్చుకుంటున్నారు. పోలంగ్ కు ముందు ఎన్నికల కమీషన్ పై తనకున్న కోపాన్ని సుబ్రమణ్యం నియమాకాన్ని ప్రశ్నించటం ద్వారా తీర్చుకున్న విషయం అందరూ చూసిందే.

 

సరే, పోలింగ్ అయిపోయింది. కౌంటింగ్ జరగటానికి ఇంకా 36 రోజుల వ్యవధి ఉంది. మరి అప్పుడు వరకూ చంద్రబాబు ఏమి చేస్తారు ?  కౌంటింగ్ జరిగి ఫలితాలు వచ్చేంత వరకూ  చంద్రబాబు ఎలా ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారో సుబ్రమణ్యం కూడా ప్రధాన కార్యదర్శిగానే ఉంటారు. అంటే ప్రభుత్వ యంత్రాంగంలో ముఖ్యమంత్రి తర్వాత అత్యున్నత అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే. కాబట్టి చంద్రబాబు ఏ శాఖతో సమీక్ష నిర్వాహించి నిర్ణయం తీసుకున్నా చివరకు ఆదేశాలు అమలు కావాల్సిందే ప్రధాన కార్యదర్శి సంతకంతోనే.

 

మరి జగన్ సహనిందితుడితో చంద్రబాబు ఎలా సమీక్షలు నిర్వహిస్తారు ?  సుబ్రమణ్యం నిందితుడు కాదన్నా చంద్రబాబు ఒప్పుకోవటం లేదు. మరి నిందితులతో కూర్చుని సమీక్షలు ఎలా చేస్తారు ? నిందితులతో కూర్చుని సమీక్షలు చేసి నిర్ణయాలు తీసుకుంటే చంద్రబాబు క్రెడిబులిటీ,  గుడ్ విల్ ఏమైపోతుంది ?  అయితే జగన్ సహనిందితుడు సుబ్రమణ్యంకు  ఇప్పుడంటే ఎన్నికల కమీషన్ ద్వారా ప్రధాన కార్యదర్శి అయ్యారు. అయితే, దీనికన్నా ముందే స్పెషల్ చీఫ్ సెక్రటరీగా మరి ఇదే చంద్రబాబు ఇదే సుబ్రమణ్యంకు ఎలా పదోన్నతి ఇచ్చారబ్బా ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: