నిజంగా చంద్రబాబునాయుడు ఏమాట్లాడుతున్నారో ఆయనకైనా అర్ధమవుతోందా ? అన్న అనుమానం వస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది జూన్ 8 వరకూ తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటూ చెప్పారు. ఎలాగంటే 2014 జూన్ 8వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు కాబట్టి 2019 జూన్  8 వరకూ ఆయనే ముఖ్యమంత్రట.

 

ఈ లాజిక్ లో ఏమాత్రం అర్ధంలేదు. ఎందుకంటే, ఐదేళ్ళ కాలపరిమితిలో చివరి ఆరుమాసాల్లో ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చు. ఒకసారి ఎన్నికల ఫలితాలు వచ్చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎప్పుడు బాధ్యతలు తీసుకోవాలన్నది ఆ పార్టీ అధ్యక్షుడు లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్ధి పైన ఆధారపడుంటుంది.

 

సాధారణంగా సిఎంగా బాధ్యతలు తీసుకునేవారు ముహూర్తాలు చూసుకునే ప్రమాణస్వీకారం చేస్తారు. చంద్రబాబు కూడా 2014 జూన్ 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేసింది ముహూర్తం చూసుకునే. ఎన్నికలు ఒకేసారి జరిగి ఫలితాలు ఒకేసారి వచ్చాయి. తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ తరపున ముఖ్యమంత్రిగా కెసియార్ జూన్ 2వ తేదీ ప్రమాణం స్వీకారం చేశారు. చంద్రబాబు మాత్రం జూన్ 8వ తేదీ బాధ్యతలు తీసుకున్నారు.

 

వాస్తవం ఇలాగుంటే జూన్ 8వ తేదీ వరకూ తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పటంమంటే చిన్నపిల్లాడి చేష్టల్లాగే ఉంది వినటానికి. మొన్న జరిగిన పోలింగ్ తాలూకు ఫలితాలు మే నెల 23వ తేదీన వచ్చేస్తాయి. ఒకవేళ వైసిపి అధికారంలోకి వచ్చిందనుకుందాం.  వైసిపి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. కాబట్టి జగన్ కూడా ముహూర్తం చూసుకునే బాధ్యతలు తీసుకుంటారు కద.

 

జగన్ జాతకం ప్రకారం ఫలితాలు వచ్చిన మరుసటిరోజే అంటే మేనెల 24వ తేదీనే ప్రమాణస్వీకారం చేయటానికి మంచిరోజు అని అనుకుందాం. కాబట్టి మేనెల 24వ తేదీనే జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారు. అంటే మే నెల 24వ తేదీన జగన్ సిఎంగా బాధ్యతలు తీసుకుంటే జూన్ 8వ తేదీ వరకూ తానే సిఎం అని చంద్రబాబు పట్టుబడితే  ఏమటర్ధం ? అప్పుడు ఏపికి ఇద్దరు సిఎంలుంటారా ?  ఏమిటో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. చంద్రబాబు మాటలు చూస్తుంటే ఎన్నికల్లో టిడిపి దిగిపోక తప్పదనే అర్ధమే కనిపిస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: