మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జోరు కొనసాగింది.  ఈ నెల 11 న పోలింగ్ తో ఎన్నికల ముగిసాయి..అయితే గెలుపు విషయంలో మాత్రం ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు.  సర్వేలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి.  ఇప్పుడు ముఖ్య నేతలు ఎన్నిల విషయంలో ఇలా జరిగింది..అలా జరిగింది అంటూ తెగ ప్రెస్ మీట్లు పెడుతున్నారు.  తాజాగా అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ కు చేదు అనుభవం ఎదురయింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జీవీఎల్ ఈరోజు మీడియా సమావేశం నిర్వహిస్తుండగా, అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. 


ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. ఆ చెప్పు ఆయనను తాకుతూ వెళ్లింది. దీంతో షాక్ అయ్యారు జీవీఎల్. వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యి అతన్ని పట్టుకున్నారు. చెప్పు విసిరింది ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన వాడని సమాచారం. అయితే, ఎందుకు అతను ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారో తెలియాల్సి ఉంది. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంతే కాదు  బీజేపీకి, జీవీఎల్ నరసింహారావుకి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. జీవీఎల్ ను కొట్టటానికి కూడా ముందుకు దూసుకొచ్చాడు. సిబ్బంది ఆపకపోతే ఘోరం జరిగేది.


 చెప్పు విసిరిన వ్యక్తిని పట్టుకున్న అక్కడి వ్యక్తులు జీవిఎల్ ను పోలీసులకు అప్పగించారు. అయితే జీవీఎల్ పై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. అయితే ఇది ముమ్మాటికి  కాంగ్రెస్ చేసిన పనిగా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారతీయ సంస్కృతిలో ఇలా నాయకులపై చెప్పులు, బూట్లు విసరడం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: