ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్ళీ పాలన వైపు ద్రుష్టి పెట్టారు. ఆన నిన్ననే సమీక్షా సమావేశాలకు తెర తీశారు. పోలవరం ప్రాజెక్ట్ తో పాటు ఇతర అంశాలపైన కూడా అధికారులతో బాబు చర్చలు జరిపారు. అంతవరకూ బాగానే ఉంది. 


కానీ చంద్రబాబు ఇపుడు  ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొత్తగా నియమితులైన ఎల్వీ సుబ్రహ్మణ్యం ను దగ్గర పెట్టుకుని ఈ రోజు సమీక్షలు చేస్తున్నారు. మరి ఇదే ఎల్వీ పై బాబు కొద్ది రోజుల క్రితం అన్న మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఎల్వీ వైసీపీ కోవర్ట్ అని, ఆయన జగన్ తో పాటు సహ నిందితుడని కూడా బాబు చిత్తం వచ్చినట్లుగా మాట్లాడేశారు. 


మరి ఇపుడు అదే కోవర్ట్ ని పక్కన పెట్టుకుని ఆయన సమీక్షలు చేస్తారా అన్న డౌట్లు అందరికీ వస్తాయి. కానీ బాబు గారిని మాత్రం ఎవరూ ఏమీ అడగకూడదు. ఎందుకంటే ఆయన చెప్పింది వినాలి. అదే నిజం అనుకోవాలి. విడ్డూరం ఏంటంటే నిన్నటికి నిన్న మళ్ళీ మీడియా మీటింగులో బాబు ఎల్వీపై తాను చేసిన కామెంట్స్ లో తప్పేంటని కూడా ఎదురు ప్రశ్నించారు. ఏది ఏమైనా అనేయడం, తరువాత ఏమీ తెలియన‌ట్లుగా వ్యవహరించడం బాబుకే చెల్లిందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: