ఎన్నికలు అయిపోయాయి. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు చాలా సమయం ఉంది. అసలు ఫలితాలు రావడమే నెల రోజులకు పైగా ఆలస్యంగా వస్తాయి. ఆ మీదట ప్రమాణ స్వీకారం చేసి అధికారంలో కుదురుకుని విధులను నిర్వహించేందుకు సిద్ధపడేసరికి కొంత టైం పడుతుంది.


ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలోనే అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖ ఈ అయిదేళ్లలో అభివ్రుధ్ధి పరంగా నోచుకున్నది ఏమీ లేదు. విశాఖను టూరిజం హబ్ చేస్తామని అన్నారు. కల్చరల్ క్యాపిటల్ అని కూడా చెప్పారు. సినీ   రాజధాని, ఆర్ధిక రాజధాని ఇలా ఎన్నో బిరుదులు ఇచ్చారు. అయితే నిజానికి విశాఖకు వొరిగింది ఏదీ లేదు. వెనకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులు కూడా దక్కలేదు. ఆఖరుకు ఎన్నికలు ఉన్నాయనగా  రైల్వే జోన్ వచ్చింది. వాల్తేర్ డివిజన్ ఎగిరింది.


ఇక సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అన్నారు. దానికి కూడా చంద్రబాబు ఆఖర్లోనే శంఖుస్థాపన మరోసారి చేశారు. ఇక స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వాలన్న డిమాండ్ ఉండనే ఉంది. విద్యల నిలయంగా విశాఖను, తయారు చేస్తామని చెప్పారు. అలాగే విశాఖ చెన్నై కారిడార్ నిర్మాణం పనులు, విశాఖ మెట్రో రైలు, కొత్తగా ఫ్లై ఓవర్లు ఇలా అనేక హామీలు ఉండనే ఉన్నాయి. వీటన్నిటికీ రూపూ రేఖా రావాలంటే మాత్రం తప్పకుండా కొత్త ప్రభుత్వం వేగంగా ప్రతిస్పందించాలి. పనులను కూడా కొలువు తీరిన మరుసటి రోజే ప్రణాళీకాబద్ధంగా చేస్తేనే విశాఖ కష్టాలు తీరుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: