అంతా నా ఇష్టం అంటున్న ఆపద్దరమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఈసీ షాక్ ఇచ్చింది. సీఎం సమీక్షలు, వీడియో కాన్ఫిరెన్స్ లు నిర్వహించకూడదంటున్న ఈసి. అధికారులందరికీ మరోసారి నియమావళిని పంపిన ఈసి. హోంశాఖ పై సమీక్షను రద్దు చేసిన సీఎం చంద్రబాబు. ప్రస్తుతం ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కొన్ని కీలక రివ్యూలు చేయకూడదని ఈసీ ఇప్పటికే పేర్కొంది.  ఈరోజు ఉదయం అమరావతి రాజధాని నిర్మాణంపై చంద్రబాబునాయుడు సమీక్ష చేశారు. ఈ సమీక్షకు మంత్రి నారాయణతో పాటు సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు. నిన్న పోలవరం ప్రాజెక్టుపై కూడా సమీక్ష చేశారు. అయితే చంద్రబాబు నాయుడు చేస్తున్న సమీక్షలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.

ఇదే సందర్భంలో ఎన్నికల అధికారులు కూడా నిబంధనల ప్రకారం..ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఎలాంటి కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి తీసుకోవద్దని నియమావళిలో పేర్కొనబడి ఉందని ఈసి అంటుంది.  ముఖ్యమంత్రి సచివాలయంలో నేరుగా రివ్యూలు చేయడం..ఆదేశాలు జారీ చేసే అవకాశం లేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి సమీక్షలు కాని, వీడియో కాన్ఫరెన్స్ లు కాని నిర్వహించకూడదని ఎన్నికల నియమావళి చెబుతుందని ఎన్నికల కమిషన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

దీనికి సంబంధించిన రాష్ట్రంలోని అన్ని అధికారులకు కోడ్ ఇలా ఉంటుంది..కోడ్ నిబంధనల గురించి ఒకటికి రెండు సార్లు స్పష్టం చేసినట్లు ద్వివేదీ ఈ రోజు మీడియాతో అన్నారు. కాగా, వివిధ వర్గాలు, ఈసి నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ వల్ల ముఖ్యమంత్రి ఓ సమీక్ష రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది.  మొత్తానికి నలబైఏళ్ల బాబు గారికి ఇప్పుడు ఈసీ పాఠాలు నేర్పే పరిస్తితి దాపురించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: