ఏపీ ఎన్నికలు ముగిసిన తరువాత ఈవీఎం ల గురించి చంద్రబాబు చేస్తున్న హడావుడి చివరికి పార్టీ శ్రేణులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎప్పుడు లేని విధంగా ఈవీఎంల గురించి చంద్రబాబు పెద్ద రచ్చే చేశారు.  అయితే ఒకప్పుడు శేషణ్ అనే ఎన్నికల ప్రధానాధికారి అన్ని పార్టీలతో సమానంగా ఉంటూ ఏ పార్టీ తప్పుచేసిన కొరడా ఝులిపించేవారు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకుల చేతిలో ఎలక్షన్ కమిషన్ పావుగా మారిందని అరోపణలు వస్తున్నాయి.


ప్రస్తుతం ఇదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేవనెత్తారు. ఎలక్షన్ నిర్వహణలో పక్షపాతాన్ని చూపించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఏపీలో ఓ పార్టీకి ఓటు వేస్తే మరో పార్టీకి పడ్డట్లు ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అప్పటికప్పుడు సారీ.. అంటూ అధికారులు ఈవీఎంలనే ఏదో చేసి సరిచేశారు. కానీ ఇలాంటి పరిస్థితి ఎన్నో చోట్ల ఎదరయ్యే ఉంటుంది..? అక్కడ ఎవరూ అడగకపోయే సరికి ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మారిందా..? అనే అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఏపీలో పోలింగ్ తీరుపై చంద్రబాబు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు.


దీంతో ప్రధాన ప్రతిపక్షాలకు ఇవే అస్త్రాలుగా మారుతున్నాయి. ఇకనైనా ఈసీ ఎలాంటి సమాధానం చెప్పకపోతే ఓటుపై సామాన్యుడికి నమ్మకం పోయే ప్రమాదం ఉంది. ప్రతిపక్ష వైసీపీ గెలిచినా చంద్రబాబు ఇదే నెపాన్నిఈవీఎంలపై వేయాలని చూస్తున్నారు. ప్రజల బలాన్ని జగన్ కు దక్కకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. జగన్ గెలుపును ఈవీఎంలపై నెట్టేందుకు నడుం బిగించారు.   సామాన్యుడికి ఓటే ఆయుధం అని అవగాహన కల్పించిన ఈసీ ఇప్పుడు ఆ ఆయుధానికి బలం పోయిందనే ఆరోపణలను ఎలా ఎదుర్కొంటుదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: